IPL-10 రికార్డులు – హీరోలు

ipl recనెల‌న‌ర్ర రోజులు భార‌త క్రికెట్ అభిమానుల‌ను అల‌రించిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్స్‌తో ముగిసింది. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ గేమ్‌గా సాగిన ఐపీఎల్‌లో ఎన్నో రికార్డులు న‌మోద‌య్యాయి మ‌రెంతోమంది లోక‌ల్ బాయ్స్ హీరోల‌య్యారు. తొలి బంతి నుంచే బ‌లంగా బాదే బ్యాట్స్‌మెన్ నుంచి అత్యంత వేగంతో బంతులు విసిరే బౌల‌ర్ల వ‌ర‌కూ ప్ర‌తి ఒక్క‌రూ త‌మ జ‌ట్టును గెలిపించేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే కొన్ని రికార్డులు కూడా న‌మోద‌య్యాయి.

ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్స్‌లో ముంబై జ‌ట్టు పూణేపై విజ‌యం సాధించ‌డంతో ఆ జ‌ట్టు స‌భ్యుడు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధిక టీట్వంటీ టైటిల్ నెగ్గిన జ‌ట్టులో స‌భ్యుడిగా స‌రికొత్త రికార్డు నెల‌కొల్పాడు రోహిత్ శ‌ర్మ‌. అంత‌కు ముందు ధోనీ రోహిత్ శ‌ర్మ‌లు స‌మానంగా ఉన్నారు.

ఇదే కాడు మ‌రెన్నో రికార్డులు ఐపీఎల్ 10 సీజ‌న్‌లో న‌మోద‌య్యాయి
ఐపీఎల్ మ్యాచ్ 51 ముంబై ఇండియ‌న్స్‌- కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో అత్య‌ధికంగా 62 బౌండ‌రీలు న‌మోద‌య్యాయి. ఇందులో 36 ఫోర్లు 26 సిక్సులు రికార్డ్ అయ్యాయి.

కోల్ క‌తా నైట్‌రైడ‌ర్స్ పై స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ 126 ప‌రుగులు చేసి అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు న‌మోదు చేశాడు. ఇక కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జ‌ట్టు అత్య‌ధికంగా 230 ప‌రుగులు చేసింది. ఈ ఫీట్‌ను ముంబైపై సాధించింది. ఆ మ్యాచ్‌లో ముంబై 223 ప‌రుగులు చేసింది.

ఐపీఎల్ 10 సీజ‌న్‌లో అన్ని జ‌ట్లు క‌లిపి సాధించిన ప‌రుగులు 18775. ఇందులో 95 హాఫ్ సెంచ‌రీలుండ‌గా.. బౌండ‌రీల ద్వారా వ‌చ్చిన ప‌రుగులు10,662 ర‌న్స్‌. మొత్తం 708 వికెట్లు ప‌డగా..3 హ్యాట్రిక్‌లు న‌మోద‌య్యాయి.

అతిపెద్ద విజ‌యంగా మొద‌ట బ్యాటింగ్ చేసిన జ‌ట్టుగా ముంబై ఇండియ‌న్స్ నిలిచింది. ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 212 ప‌రుగులు చేసిన ముంబై… ఢిల్లీని 66 ప‌రుగుల‌కే ఆలౌట్ చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగి అత్యంత పెద్ద విజ‌యం సాధించిన జ‌ట్టుగా కోల్‌కతా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు నిలిచింది. 4 వికెట్ల న‌ష్టానికి 183 ప‌రుగులు చేసిన గుజ‌రాత్ ల‌య‌న్స్‌పై కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా గ్రాండ్ విక్ట‌రీ రికార్డ్ చేసింది.

మొత్తం ఐపీఎల్‌లో న‌మోదైన సిక్సుల సంఖ్య 705 కాగా… లాంగెస్ట్ సిక్స్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్  కొట్టాడు. బంతిని 109 మీట‌ర్ల‌కు పంపాడు.
బెస్ట్ బౌలింగ్ ఫిగ‌ర్స్‌లో  గుజ‌రాత్ ల‌యన్స్‌కు చెందిన ఆండ్రూ టై 17 ప‌రుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ఒక మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్‌లో డిసైడ్ కాగా చివ‌రి బంతికి విక్ట‌రీ సాధించిన మ్యాచుల సంఖ్య ఒక‌టిగా నిలిచింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ 10 సీజ‌న్లు జ‌రుగ‌గా.. ముంబై ఇండియ‌న్స్ అత్య‌ధికంగా 3 టైటిళ్ల‌ను కైవ‌సం చేసుకుంది. 2017, 2015, 2013 సీజ‌న్ల‌లో టైటిల్ నెగ్గింది.

ఈ సీజ‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను స‌న్‌రైజ‌ర్స్  హైద‌రాబాదు జ‌ట్టు కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ (641) ద‌క్కించుకోగ‌… అత్య‌ధిక వికెట్లు తీసుకున్న బౌల‌ర్‌గా భువ‌నేశ్వ‌ర్ కుమార్ (26వికెట్లు) నిలిచాడు. అత్యంత వేగ‌వంత‌మైన బంతిని ఢిల్లీ డేర్ డెవిల్స్ బౌల‌ర్ గంట‌కు 153.56 కిలోమీట‌ర్ల వేగంతో  ప్యాట్ క‌మిన్స్ సంధించాడు. హ‌షీమ్ ఆమ్లా 2 సెంచ‌రీలు చేసి అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. అత్య‌ధిక హాఫ్ సెంచ‌రీలు న‌మోదు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రాబిన్ ఊత‌ప్ప నిలిచాడు. మొత్తం 5 అర్థ‌సెంచ‌రీలు ఈ సీజ‌న్‌లో చేశాడు రాబిన్‌.

బెస్ట్ క్యాచ్ రైనా తీసుకున్నాడు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయ‌ర్‌గా బెన్ స్టోక్స్ ఎన్నిక‌య్యాడు. ఫేర్ ప్లే అవార్డు గుజ‌రాత్ ల‌య‌న్స్‌కు ద‌క్కింది. ఎమ‌ర్జింగ్ ప్లేయ‌ర్ అవార్డు గుజ‌రాత్ జ‌ట్టుకు చెందిన బాసిల్ థంపీని వ‌రించింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy