IPL-11 : హైదరాబాద్ టీమ్ సాంగ్ రిలీజ్

IPL SRH SONGIPL సీజన్-11 దగ్గరపడుతున్నాకొద్దీ క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రెట్టింపు అవుతోంది. ఏప్రిల్ 7నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ కోసం యాజమాన్యం ఇప్పటికే ప్రచారం షురూ చేసింది. ఇప్పటికే IPL-11కి సంబంధించిన సాంగ్ ని రిలీజ్ చేసిన నిర్వాహకులు..మంగళవారం (మార్చి-20) SRH (హైదరాబాద్) టీమ్ స్పెషల్ సాంగ్ ని విడుదల చేసింది IPL. ఇప్పటికే విడుదలైన IPL ప్రచార సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ క్రమంలోనే ఫ్రాంఛైజీలూ సొంత ప్రచార పాటలను విడుదల చేశాయి. ఈ సందర్భంగా సన్‌రైజర్స్‌ హైదారాబాద్‌ తన ప్రచార పాటను ట్విటర్ ద్వారా పంచుకుంది. గో గో గో గో హియర్‌ వి గో గో గో… వియ్‌ ఆర్‌ ది ఆరెంజ్‌ ఆర్మీ అంటూ సాగే ఈ సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ సాంగ్ హల్ చల్ చేస్తోంది. ఈ సంవత్సరం IPL ఏప్రిల్‌ 7న ప్రారంభంకానుంది. టోర్నీలో భాగంగా హైదరాబాద్‌ తన ఫస్ట్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది. ఏప్రిల్‌ 9న ఈ మ్యాచ్‌ జరగనుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy