IPL10: గుజరాత్ టార్గెట్-214 రన్స్

GAYAL-KOHLIరాజ్ కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా గుజరాత్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 213 పరుగులు చేసింది. ఓపెనర్లు  కోహ్లీ (64), క్రిస్ గేల్ (77) విజృంభించి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అలాగే క్రిస్ గేల్ టీ20 మ్యాచుల్లో 10 వేల పరుగుల మార్క్ ను క్రాస్ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు కెక్కాడు. కానీ 122 పరుగుల దగ్గర గేల్ ఎల్బీడబ్ల్యూ కావడంతో ఇద్దరి భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.తర్వా 159 పరుగుల దగ్గర కోహ్లీ ఔటయ్యాడు. తర్వాత ట్రావెస్ హెడ్ (30), కేదార్ జాధవ్ (38) అద్భుతంగా ప్రదర్శించి స్కోరు ను 213 పరుగులకు తీసుకెళ్లారు. దీంతో గుజరాత్ కు 214 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది బెంగళూరు.

గుజరాత్ బౌలర్లు కుల్ కర్ణి,బాసిల్ తంపి చెరో వికెట్ తీసుకున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy