IPL10: ఫైనల్లో పూణేతో ముంబై ఢీ

MUBAIబెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్  రెండో క్వాలిఫయర్ రౌండ్ లో ముంబై ఇండియన్స్ దుమ్మురేపింది. కోల్ కతా నైట్ రైడర్స్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లింది. తోలుత టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌కతా 18.5 ఓవర్లలో 107 పరుగులకే అలౌట్ అయిపోయింది. దీంతో 108పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై లక్ష్యాన్ని ఈజీగా చేధించింది. 14.3 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసిన ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కృనాల్ పాండ్య (45) అద్భుతంగా రాణించి నాటౌట్ గా నిలిచాడు. అంతకు ముందు రోహిత్ శర్మ (26) చెలరేగి బ్యాటింగ్ చేశాడు. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగే ఫైనల్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy