IPL10: ముంబై ఇండియన్స్ టార్గెట్ -108 రన్స్

22బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 18.5 ఓవర్లలో 107 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ కు 108 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. ముంబై ఇండియన్స్ పై టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యంత పేలవ ప్రదర్శన కనబర్చింది. ఆది నుంచి బ్యాట్స్‌మెన్లు పెవిలియన్ బాట పట్టారు. 31 పరుగలకే 5 వికెట్లు కోల్పోయిన జట్టుకు ఇషాంక్ జగ్గి (28), సూర్యకుమార్ యాదవ్ (31) పరుగులు చేసి అండగా నిలిచారు. మిగతా ఆటగాళ్లు అంతగా రాణించలేక పోయారు.

ముంబై ఇండియన్స్‌ బౌలర్లు కేవీ శర్మ 4, బూమ్రా 3, జాన్సన్ 2, మళింగ ఒక వికెట్ తీసుకున్నారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy