IPL మ్యాచ్-31: ముంబైపై బెంగళూరు విక్టరీ

KOHLIముంబై ఇండియన్స్‌ పై బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ ప్రతీకారం తీర్చుకుంది. IPL–11లో భాగంగా బెంగళూరు వేదికగా మంగళవారం (మే-1) ముంబైతో జరిగిన మ్యాచ్ లో 14 పరుగుల తేడాతో విజయం సాధించింది చాలెంజర్స్‌ . మొదట బ్యాటింగ్‌ కు దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. మనన్‌ వోహ్రా (31 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడగా, మెకల్లమ్‌ (25 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. ముంబై బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా (3/28) రాణించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 153 పరుగులకే పరిమితమైంది. హార్దిక్‌ పాండ్యా (42 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచరీ చేశాడు. బెంగళూరు పేసర్లు మొహమ్మద్‌ సిరాజ్, ఉమేశ్‌ యాదవ్, సౌతీ తలా రెండు వికెట్లు తీసి ముంబై పతనాన్ని శాసించారు. సౌతీకి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy