IRNSS-1H ప్రయోగానికి ఇస్రో రెడీ

irnss-1hమరో ఉపగ్రహం ప్రయోగానికి రెడీ అవుతోంది ఇస్రో. దీనికి సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. ఇండియన్‌ రీజినల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టం (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1 హెచ్‌) ఉపగ్రహాన్ని మంగళవారం పీఎస్‌ఎల్‌వీ సీ–39 రాకెట్‌కు అమర్చారు. 1,400 కిలోల బరువైన ఈ ఉపగ్రహాన్ని రాకెట్‌కు శిఖర భాగాన అనుసంధానించారు.  అన్ని పరీక్షలు నిర్వహించి బుధవారం హీట్‌షీల్డ్‌ క్లోజ్‌ చేసే ప్రక్రియను పూర్తి చేయనున్నారు. 28న తుది విడత సంసిద్ధతా కార్యక్రమం నిర్వహి స్తారు. అనంతరం కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 31 సాయంత్రం 6.59కి ప్రయోగాన్ని నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రయోగం తేదీని, సమయాన్ని తుదివిడత ఎంఆర్‌ఆర్‌ సమావేశంలో అధికారికంగా ప్రకటిస్తారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy