ISI ఏజెంట్ గా బీజేపీ కౌన్సిలర్ సోదరుడు

BJPపాకిస్థాన్ తరుపున గూఢచర్యం నిర్వహించి భారత ఆర్మీ రహస్యాలు చేరవేస్తున్న 11 మందిని మధ్యప్రదేశ్ ఉగ్ర నిరోధక దళం అరెస్ట్ చేసింది. ఇందులో బీజేపీకి చెందిన ఓ కౌన్సిలర్ సోదరుడు కూడా ఉన్నాడు. వీరు భోపాల్, గ్వాలియర్, జబల్‌పూర్, సాట్నాలో చైనా పరికరాలతో టెలిఫోన్ ఎక్సైంజ్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా ఇండియన్ ఆర్మీ సైనిక ఆపరేషన్స్ సమాచారాన్ని పాక్‌లోని ISI కి చేరవేస్తున్నట్లు విచారణలో తేలింది.

ఈ ముఠాకు చెందిన నాయకుడు బలరామ్ బ్యాంకు ఖాతాల్లోకి పాక్ నుంచి డబ్బులు జమ అవుతున్నాయి. వీటిని బలరామ్ జమ్మూకశ్మీర్‌లోని ఇద్దరు పాక్ ISI చెందిన వారికి చేరవేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. గతేడాది నవంబర్ 13న ఈ ఇద్దరి అరెస్ట్‌తో ఈ ముఠా గుట్టు రట్టయ్యింది. అయితే వీరిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy