ISISపై అమెరికా అతిపెద్ద బాంబ్ ప్రయోగం

bombతూర్పు ఆఫ్ఘనిస్తాన్ లోని ISIS ఉగ్రవాద స్థావరాలను అమెరికా మిలిటరీ ధ్వంసం చేసింది. ఐసిస్ ఉగ్రవాద కాంప్లెక్సులు లక్ష్యంగా అక్కడి టైమ్ ప్రకారం రాత్రి 7గంటలకు GBU-43B అనే అతిపెద్ద బాంబును ప్రయోగించింది. నంగర్హర్ ప్రావిన్స్ లో ఉన్న అచిన్ ప్రాంతంలో ఖొరాసన్ సొరంగంమీద 10వేల 300 కిలోల బాంబును అమెరికన్ యుద్ద విమానం MC-130 జారి విడిచింది. GBU-43B బాంబును ప్రయోగించడం ఇదే మొదటిసారని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ప్రతినిధులు చెప్పారు. బాంబు ప్రయోగం తర్వాత సాధారణ ప్రజలు, అమెరికా, ఆఫ్ఘన్ సైన్యంలకు నష్టం కలగకుండ చూసుకున్నట్టు చెప్పారు. ఐఎస్ ఉగ్రవాదులకు, వారి క్యాంపులకు ఎక్కువ నష్టం జరిగే విధంగా బాంబు ప్రయోగం చేశామన్నారు.

GBU-43B మాసివ్ ఆర్డెనెన్స్ ఎయిర్ బ్లాస్ట్ బాంబును 2003లో తయారు చేసింది అమెరికా. 2003ఇరాక్ యుద్దం టైమ్ లో టెస్ట్ చేశారు. బాంబు పొడవు 30 అడుగులు ఉంటుంది. దీన్నే మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని కూడా పిలుస్తారు. నాన్-న్యూక్లియర్ బాంబ్స్ కాని బాంబుల్లో ఇదే అన్నింటికంటే పెద్దదని చెబుతారు. ఇప్పటిదాక  దీన్ని ఎక్కడా వేయలేదు. ఫస్ట్ టైమ్ నిన్ననే ఆఫ్ఘనిస్తాన్లో ప్రయోగించారు. ISISను అంతం చేసే వ్యూహంలో భాగంగనే.. GBU-43B బాంబు ప్రయోగం చేసినట్లు స్పష్టం చేశాయి పెంటగాన్ వర్గాలు.

ISIS పై బాంబు దాడి చేసిన మిలిటరీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెచ్చుకున్నారు. మిలిటరీకి తాను అన్ని అధికారాలు ఇచ్చినట్లు చెప్పారు. లేటైనా.. అమెరికా సక్సెస్ కావడానికి అదే కారణమన్నారు. 8 ఏళ్లలో జరిగినదానికి ఇప్పుడు జరుగుతున్నదానికి టోటల్ డిఫరెన్స్ ఉంటుందన్నారు. బాంబు దాడితో ఉగ్రవాదుల క్యాంపులన్ని నాశనమైయ్యాయన్నారు పెంటగాన్ అధికారులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy