ISISలోకి హైదరాబాద్ కుర్రోళ్లు

TERROR WEB IMAGEISIS ఉగ్రవాదుల హైదరాబాద్ లింకులు మరోసారి కలకలం సృష్టించాయి. ఐసిస్ లో చేరేందుకు వెళ్తున్నట్టు అనుమానిస్తున్న ముగ్గురు యువకులు అబ్ధుల్ వాసిం, ఒమర్ హాసన్ ఫారూఖీ, మజీ హసన్ ఫారూఖ్ లను మహారాష్ట్ర ఏటీస్ అదుపులోకి తీసుకుంది. నాగపూర్ ఎయిర్ పోర్ట్ లో వీళ్ల ముగ్గురిని  అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు. ఈ ముగ్గురు  హైదరాబాద్ కు చెందిన వారేనని తెలుస్తోంది. సిటీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో నాగపూర్ వెళ్లిన ఈ ముగ్గురు..ఇండిగో ఫ్లైట్ లో శ్రీనగర్ వెళ్లేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. అక్కడి నుంచి అప్ఘానిస్తాన్ తర్వాత సిరియా వెళ్లాలనేది వీళ్ల ప్లాన్ గా తెలుస్తోంది. సిరియాలో ఐసిస్ లో చేరడమే  వీళ్ల టార్గెట్. తెలంగాణ, మహారాష్ట్ర పోలీసుల  జాయింట్ ఆపరేషన్ తో..ముగ్గురిని ఫ్లైట్ ఎక్కకుండానే అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు యువకులపై రాష్ట్ర ATS పోలీసులు మొదటి నుంచే నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. అనుమానితుల సమాచారాన్ని మహారాష్ట్ర ATS కు ఇచ్చారు రాష్ట్ర పోలీసులు. పక్కా సమాచారంతో నాగపూర్ ఎయిర్ పోర్టులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు మహా పోలీసులు. తర్వాత తెలంగాణ ATS పోలీసులకు అప్పగించారు. ఐతే ఈ ముగ్గురు యువకులపై సిటీలోని పలు పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ముగ్గురు ఐసిసి సానుభూతిపరుల అరెస్ట్ తో హైదరాబాద్ మరోసారి ఉలిక్కిపడింది. దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా ఎక్కడో ఓ చోట ఓల్డ్ సిటీతో లింక్ ఉంటోంది. సిటీ యువతపై నిఘా పెట్టిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్…ఇంటలిజెన్స్ పక్కా స్కెచ్ వేసి ముగ్గురికి చెక్ పెట్టింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే..మన రాష్ట్రం నుంచే ఐసిస్ ఆకర్షితుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇంటెలిజెన్స్, ఏటీఎస్ లెక్కల ప్రకారం 60మంది పైగా టెర్రర్ ట్రైనింగ్ తీసుకున్నట్టు టాక్. సోషల్ సైట్లలో ఐసిస్ కార్యకలాపాల్ని ..ఫాలో అవుతూ…తమ ఒపీనియన్స్ ను షేర్ చేసుకుంటున్న వాళ్లు సిటీలో వందల్లో ఉన్నారు. ఐసిస్ లో చేరేందుకు వెళ్లిన 19మంది ఓల్డ్ సిటీ యువకులను స్టేట్ ఇంటలిజెన్స్ ఐడెంటిఫై చేసింది. వారిలో 16మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఐతే వీరిలో మరో ముగ్గురి అడ్రస్ దొరకలేదు.  మరో వైపు ఆదిలాబాద్  జిల్లాకు చెందిన మహ్మద్  ఆతిఫ్  వసీమ్  సిరియాలో చనిపోగా…ముషీరాబాద్  ప్రాంతానికి చెందిన సాఫ్ట్ వేర్  ఇంజినీర్  మునవద్  సల్మాన్ , అఫ్సా జబీన్ ను, ఆమె సహచరుడు సల్మాన్  మొహియుద్దీన్ ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఐసిస్ వలలో పెద్దల నుంచి మైనర్లు పడిపోతున్నారు. పోలీసులు ఎంతగా వార్నింగ్ ఇచ్చినా…ఎంత నిఘా పెట్టినా..ఐసిస్ గాలి ఓల్డ్ సిటీ యూత్ ను తాకుతోంది. నాగపూర్ ఎపిసోడ్ తో నిఘాని మరింత టైట్ చేస్తామంటున్నారు ఏటీఎస్ పోలీసులు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy