ITIRపై కేంద్రానికి కేటీఆర్ లేఖ

ktr610హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టుపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు లేఖ రాశారు మంత్రి కేటీఆర్. ఐటీఐఆర్ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయడం లేదన్నారు మంత్రి. 2013 సెప్టెంబర్ లో ప్రతిష్టాత్మక ఐటీఐఆర్ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతిచ్చినా.. ఇప్పటివరకు నామమాత్రపు నిధులు కూడా విడుదల కాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్టు జాతీయ స్థాయిలో ఆసక్తి రేకెత్తించిందనీ కానీ నాలుగు సంవత్సరాలలో కేంద్రం నుంచి సరైన మద్దతు లేక ప్రాజెక్టు ముందుకు సాగలేదని చెప్పారు. ఈ ప్రాజెక్టుపై విధాన పరమైన స్పష్టత ఇవ్వడంతోపాటు, నాలుగేళ్ల కింద ఆమోదించిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీఐఆర్ పై డీపీఆర్ రెండు సార్లు కేంద్రానికి సమర్పించామన్నారు. ప్రాజెక్టు అమలుకు మౌలిక వసతుల కోసం 4వేల 8వందల 63 కోట్లను రెండు దశల్లో అందించాలని కోరారు, తెలంగాణ ఐటీ ఎగుమతులు జాతీయ సగటు కన్నా అధికంగా ఉన్నాయన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి జాతీయ సగటు కన్నా నాలుగు శాతం అధికంగా ఐటీ ఎగుమతులను తెలంగాణ రాష్ట్రం నుంచి నమోదయ్యాయని లేఖలో చెప్పారు కేటీఆర్.

Leave a Reply

bathukamma song

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy