JDS డీలా : అవే సీట్లు.. కింగ్ మేకర్ కాలేదు

JDS-KAకర్నాటకలో హంగ్ వస్తుంది.. కాంగ్రెస్ – బీజేపీ పార్టీలకు జేడీఎస్ మద్దతు అవసరం.. కింగ్ మేకర్ అవుతుంది అంటూ సర్వేలన్నీ కోడైకూశాయి. ఒక్క కర్నాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇదే అభిప్రాయం. అందుకు భిన్నంగా తీర్పు ఇచ్చారు కన్నడ ఓటర్లు. కుమారస్వామి నేతృత్వంలోని జనతాదళ్ సెక్యులర్ పార్టీని ఆదరించారు. 2013 ఫలితాలను పోల్చితే.. మంచి ఫలితాలనే ఇచ్చారు. 2శాతం ఓటింగ్ తగ్గినా.. 40 సీట్లను కట్టబెట్టారు కర్నడీగులు. అయితే జేడీఎస్ కంటే ఎక్కువగా బీజేపీని ఆదరించారు. జేడీఎస్ ను 40 సీట్లలోనే గెలిపించారు. కాకపోతే కింగ్ మేకర్ స్థాయికి మాత్రం తీసుకెళ్లలేకపోయారు కన్నడ ప్రజలు.

బీజేపీ 112 స్థానాల్లో, కాంగ్రెస్ 68 సీట్లలో, జేడీఎస్ 40 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. వాస్తవ లెక్కలు ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ కు భిన్నంగా ఉన్నాయి. హంగ్ వస్తుందని.. జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందని విశ్లేషించారు. అందుకు దగ్గరగా ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ 40 నియోజకవర్గాల్లో జేడీఎస్ ఆధిక్యంలో నిలిచింది. అయితే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ సాధించటంతో జేడీఎస్ మద్దతు అవసరం లేకుండా పోయింది. అనుకున్న సీట్లు సాధించినా.. మరో పార్టీని పీఠం ఎక్కించే స్థాయిలో లేకపోవటంతో జేడీఎస్ డీలా పడింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy