JEE అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల

IITIITల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన JEE అడ్వాన్స్‌డ్-2018 ప్రవేశ పరీక్ష ఫలితాలు ఆదివారం(జూన్-10) విడుదలయ్యాయి. ర్యాంకులను ఉదయం 10 గంటలకు IIT కాన్పూర్ విడుదల చేసింది. అడ్వాన్స్‌డ్‌లో 18,138 మంది విద్యార్థులు అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా మే 20న అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించగా మొత్తం 1,55,158 మంది విద్యార్థులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 11,279 సీట్లు మాత్రమే ఉన్నాయి. ర్యాంకులను results.jeeadv.ac.in వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. కటాఫ్‌ మార్కులు సాధించిన వారు ఈనెల 15 నుంచి జరిగే జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) నిర్వహించే కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు.

JEE అడ్వాన్స్‌డ్-2018 ర్యాంకర్లు…

పంచకులకు చెందిన ప్రణవ్ గోయల్- మొదటి ర్యాంకు(337 మార్కులు)

వియవాడ విద్యార్థి శివకృష్ణ మనోహర్‌- ఐదో ర్యాంకు(ఓబీసీ కేటగిరి)

విశాఖకు చెందిన హేమంత్ కుమార్‌- ఏడో ర్యాంకు

హైదరాబాద్ విద్యార్థి జె.శివతరణ్- మొదటి ర్యాంకు (ఎస్టీ కేటగిరి)

బాలికల విభాగంలో మీనల్ పరఖ్- ఆరో ర్యాంకు( ఓపెన్ కేటగిరీ)

ఎస్సీ విభాగంలో ఆయుష్ కడమ్‌-మొదటి ర్యాంకు( ఎస్సీ కేటగిరి)

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy