బిల్లుకు మద్దతు కూడగడుతున్న కెసిఆర్

KCR IMAGE 1తెరాస ముఖ్య నాయకుడు కెసిఆర్ ఢిల్లీ లో తెలంగాణా బిల్లుకు వివిధ పార్టీల మద్దతు కూడగట్టడంలో బిజీ గా ఉన్నారు. ఆదివారం RJD, LJP, JDU నాయకులైన లాలూ ప్రసాద్ యాదవ్, రాం విలాస్ పాశ్వాన్, శరద్ యాదవ్ లం కలిసిన T ఉద్యమ నాయకుడు పార్లమెంటులో బిల్లు పై వారి మద్దతుపై హామీలు తీసుకున్నారు. సోమవారం ఆయన BJP అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, BSP నాయకురాలు మాయావతి లను కలవనున్నారు. కిరణ్, ఇతర సీమాంధ్ర నాయకులు దీక్షలు, పాద యాత్రలు, సుప్రీం కోర్టులో కేసులు లాంటి రకరకాల వ్యూహాలు రచిస్తుండగా కాంగ్రెస్ నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రక్రియను ఐదు నుండి ప్రారంభమయ్యే ఈ సెషన్ లోనే ముగించేందుకు కెసిఆర్ ఎత్తులు కీలకం కానున్నాయి.

TDP నాయకుడు చంద్రబాబు కూడా రాజ్ నాథ్ ను సోమవారం కలవనున్నారు. మరో వైపు పార్లమెంటు సమావేశాల్లో చేబట్ట బోయే బిల్లులు, అనుసరించాల్సిన వ్యూహాల గురించి UPA మిత్ర పక్షాల సమావేశం కూడా సోమవారమే జరుగనుంది.

బిల్లు అభిప్రాయాలతో సహా కేంద్రం ఇప్పటికే చేరినందున కొద్దిరోజుల వరకు ఢిల్లీ లో తెలంగాణా హోరు పూర్తీ స్థాయిలో ఉండనుంది.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy