రేపు యాగం చేయనున్న కేసీఆర్

 తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, సీఎం కేసీఆర్‌ రేపు రెండు యాగాలు చేయనున్నారు.. మెదక్‌ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో రాజా శ్యామల చండీహోమం, చండీ సహిత రుద్ర హోమం జరుపనున్నారు. ఈ హోమానికి కేసీఆర్ కుటుంబసభ్యులతో పాటు టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్యనాయకులు పాల్గొననున్నారు. 120 మంది బ్రాహ్మణులు యాగకార్యాన్ని నిర్వహించనున్నారు.

ఇదిలా ఉంటే … తెలంగాణలో ఎన్నికల ప్రచారాలు వేడెక్కుతున్నాయి. ప్రచారానికి అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఈ నెల 14 వ తారీకున నామినేషన్ వేసిన కేసీఆర్ 19వ తారీకు నుంచి ప్రచార సభలల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే అన్ని నియోజక వర్గాలకూ పోటీ చేయబోయో అభ్యర్థులను డిసైడ్ చేశారు. దీంతో ప్రచారపర్వానికి కేసీఆర్ రెడీ అవుతున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy