ఐసీసీ అవార్డులు దున్నేసిన కోహ్లీ : 5 అత్యున్నత పురస్కారాలతో వండర్ రికార్డ్

ఐసీసీ అవార్డులు కొల్లగొట్టిన విరాట్ కోహ్లీ

వావ్…. ఓ క్రికెటర్ కు ఇంతకన్నా గొప్ప ఘనత మరోటి ఉండకపోవచ్చు. 2018 ఏడాదిలో అత్యంత భీకరమైన ఫామ్ చూపించిన టీమిండియా స్కిప్పర్ విరాట్ కోహ్లీని.. ఐసీసీ అత్యంత ప్రతిష్టాత్కమైన అవార్డులన్నీ గంపగుత్తగా వరించాయి. గ్యారీ సోబర్స్ ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్… ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్… ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్.. ఐసీసీ టెస్ట్ టీమ్ 2018 కెప్టెన్… ఐసీసీ వన్టే టీమ్ 2018 కెప్టెన్… ఇలా… అన్ని అవార్డులు విరాట్ కోహ్లీనే వరించాయి. వన్డే, టెస్ట్, క్రికెటర్ ఆఫ్ ద ఇయర్..  ఇలా.. 3 ఐసీసీ అవార్డులు దక్కించుకున్న ఒకే ఒక్క క్రికెటర్ గా విరాట్ కోహ్లీ చరిత్రకెక్కాడు.

ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా కోహ్లీ నిలవడం ఇది రెండోసారి. లాస్టియర్ కూడా ఈ అవార్డ్ కోహ్లీకే వచ్చింది. 2018లో విరాట్ కోహ్లీ.. 133.35సగటుతో.. 1,202 రన్స్ చేశాడు. వన్డే కెరీర్ లో పదివేల రన్స్ వేగంగా పూర్తిచేసిన ప్లేయర్ గా రికార్డ్ సాధించాడు

విరాట్ కోహ్లీ తొలిసారి ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ గెల్చుకున్నాడు. 2018లో 55.08 సగటుతో.. 1,322 రన్స్ చేశాడు. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఇండియాల్లో సెంచరీలు చేశాడు.

2018లో టెస్ట్, వన్డేల్లో కలిపి విరాట్ కోహ్లీ 37 మ్యాచ్ లలో 47 ఇన్నింగ్స్ ఆడాడు. 68.37 సగటుతో… 2, 735 రన్స్ చేశాడు. ఇందులో 11 సెంచరీలు.. 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కళ్లుచెదిరే పరుగుల రికార్డ్ ను సాధించడంతో……. ఐసీసీ 2018 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ కు విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు.

విరాట్ కు అరుదైన గౌరవం : ఐసీసీ వన్డే, టెస్టు టీమ్స్ కు కెప్టెన్ గా కోహ్లీ

టీమ్ ఆఫ్ ది ఇయర్-2018 పేరుతో వన్డే, టెస్ట్, టీమ్ లను ప్రకటించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC). 2018లో అత్యంత ప్రతిభ కనబరిచిన ప్లేయర్లకు టెస్టు, వన్డే టీమ్స్ లో చోటు కల్పించింది ICC. ఈ రెండింటికి కెప్టెన్ గా విరాట్ కోహ్లీ సెలక్ట్ అయ్యాడు.

వన్డే టీమ్ లో

విరాట్ కోహ్లీ(కెప్టెన్)
రోహిత్ శర్మ
కుల్దీప్ యాదవ్
బుమ్రా
రషీద్ ఖాన్(ఆఫ్ఘనిస్తాన్)
బరిస్టో(ఇంగ్లాడ్)
జో రూట్ (ఇంగ్లాండ్)
రోస్ టేలర్(న్యూజిలాండ్)
బట్లర్(ఇంగ్లాండ్)
బెన్ స్టోక్(ఇంగ్లాండ్)
ముస్తపుజూర్ రహెమాన్(బంగ్లాదేశ్)

టెస్ట్ టీమ్ లో

విరాట్ కోహ్లీ (కెప్టెన్)
రిషబ్ పంత్
బుమ్రా
అబ్బాస్( పాకిస్తాన్)
లయన్(ఆస్ట్రేలియా)
రబడ(సౌతాఫ్రికా)
హోల్డర్(వెస్టిండీస్)
లాథమ్(న్యూజిలాండ్)
కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)
హెన్రీ నికోలస్(న్యూజిలాండ్)
కరునారతణే(శ్రీలంక)  ప్లేయర్లు సెలక్ట్ అయ్యారు. ఈ విషయాన్ని ICC అఫీషియల్ ట్విట్టర్ ద్వారా తెలుపుతూ..కోహ్లీ ఫోటొను పోస్ట్ చేసింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy