KTR అసెంబ్లీ ఉపన్యాసం మిగితా భాగం

ktr

ట్యాంక్ బండ్  పై విగ్రహాల కూల్చివేత గురించి మాట్లాడుతూ ‘వేల మంది పిల్లలు చనిపోతే కనీసం సంతాపం వ్యక్తం చేయలేదు… మట్టి విగ్రహాల గురించి తెగ బాధపడ్డారు” అన్నారు. ఈ వ్యాఖ్యపై సీమాంధ్రుల నిరసనతో సభ కాసేపు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన తర్వాత KTR ఉపన్యాసం మిగిలిన భాగం … as it is…

ట్యాంక్ బండ్ పై విగ్రహాలు పగిలిపోతే తెగ బాధ పడ్డారు…
వందల మంది తెలంగాణ బిడ్డలు చనిపోతే మాత్రం చలించలేదు
ట్యాంక్ బండ్ పై ఉన్నవి ముమ్మాటికి మట్టి విగ్రహాలే
నా వ్యాఖ్యల్లో తప్పేం లేదు: కేటీఆర్
ట్యాంక్ బండ్ విగ్రహాల గురించి మాట్లాడే వారికి అమాయకుల చావులు కనిపించవా..?

బతికున్న వారికి సమాధులు కట్టిన వాళ్లు, మా సంస్కారం గురించి మాట్లాడుతారా..?
మీ నుంచి మేం సంస్కారం నేర్చుకోవాలా..?
ఎన్టీఆర్ పై చెప్పులు వేయించిన దుర్మార్గులు టీడీపీ నేతలు ముందు ఎన్టీఆర్ కు వాళ్లు క్షమాపణ చెప్పాలి
టీడీపీ నేతలకు నైతికత ఉంటే రాజీనామా చేయాలి, తెలంగాణపై మాట మార్చినందుకు క్షమాపణ చెప్పాలి, సమైక్యమంతా డొల్లతనమే, నీరు, కరెంట్ దొరకదంటూ భయపెడుతున్నారు, విలీనం సమయానికి తెలంగాణలో 30వేల పైచిలుకు చెరువులుండేవి

కేటీఆర్ వ్యాఖ్యలపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అభ్యంతరం తెలిపారు…
ఓవైపు సంతోషముంది.. మరోవైపు బాధ ఉంది
బాధలో ఉన్నవాళ్లు ఓ మాటంటే సహించరా..?
ఎన్టీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారు..?
కేటీఆర్ ది జాత్యహంకార ధోరణి
తెలంగాణ పేరుతో రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు
ఓట్లు, సీట్లతో రాజకీయం చేసే పార్టీ టీఆర్ఎస్ — పయ్యావుల కేశవ్

KTR తిరిగి ఉపన్యాసం ప్రారంభించారు…

69శాతం కృష్ణా, 79శాతం గోదావరి పరివాహక ప్రాంతం తెలంగాణ భూభాగంలో ఉంది, కానీ.. 15శాతానికి మించి తెలంగాణకు నీరు అందలేదు, పాలమూరు తెలంగాణలో అతిపెద్ద జిల్లా, అత్యంత దుర్భిక్ష ప్రాంతం కూడా పాలమూరే, నత్తలు కూడా సిగ్గుపడేలా పనులు చేస్తున్నారు, అనుమతి లేకున్నా సీమాంధ్రలో ప్రాజెక్టులు పూర్తి చేశారు, లిఫ్ట్ ఇరిగేషన్ అందుబాటులో ఉన్నా తెలంగాణలో అమలు చేయలేదు

నీటి పంపిణీ, వివాదాలపై కమిటీలున్నా నీటి యుద్ధాలు జరుగుతాయని సీఎం అనడం హాస్యాస్పదం
జలయజ్ఞం పేరుతో నీళ్లన్నీ సముద్రంపాలు చేశారు, అపోహలు సృష్టించవద్దని సీఎంను కోరుతున్నా
హైదరాబాద్ అభివృద్ధి చెందినది కాబట్టే అందరూ వచ్చారు, వాళ్లకు వాళ్లు కితాబులిచ్చుకుంటే సరిపోదు
హైదరాబాద్ పై బిన్నాభిప్రాయాలు చెప్తున్నారు, 1908లో దేశంలో నాలుగో అభివృద్ధి చెందిన నగరం
1948లో 5వ అభవృద్ధి చెందిన నగరం హైదరాబాద్, హైదరాబాద్ విషయంలో అసంబద్ధ వాదనలు సరికాదు
1937లో టైమ్ మ్యాగజిన్ గుర్తించింది
స్కామ్ కాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ ను తీర్చిదిద్దిన ఘనత సీమాంధ్రులదే
ప్రతి భారతీయుడికి హైదరాబాద్ లో నివసించే హక్కు ఉంది.. రావొచ్చు.. బతకొచ్చు
హైదరాబాద్ సంస్కారం ఉన్న ప్రాంతం, హైదరాబాద్ విషయంలో అనుమానాలకు తావియ్యకండి
తెలంగాణ ఏర్పాటుకు ఒక దశలో ఎన్టీఆర్ కూడా సహకరించారు
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా రెండు గా విభజించి తెలుగు ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లాలని కోరుతున్నానని ప్రకటించారు
స్వయాన మాజీ డీజీపీ కూడా సీఎం కుట్రలను వెల్లడించారు
స్పష్టమైన తీర్మానం చేశాక కూడా చంద్రబాబు విభేదిస్తున్నారు
శాశ్వత శత్రుభావం ఏర్పడక ముందే సీమాంధ్రులు ఉద్యమ ప్రభావం గుర్తించి గౌరవించాలి
విభజనతో రెండు ప్రాంతాలు బాగుపడతాయని ఆశిస్తున్నాం
చివరి దశలో విజ్ఞత ప్రదర్శించి సహకరించాలి

బిల్లుపై తెరాస ప్రతిపాదిస్తున్న సవరణలను KTR క్లుప్తంగా పేర్కొన్నారు.:

3 ఏళ్లుగా మాత్రమే ఉమ్మడి రాజధాని.. కొత్త రాజధాని
గవర్నర్ కు శాంతిభద్రతల అంశంపై వ్యతిరేకం
ఉన్నత విద్యలో వాటాలు నేటివిటీ ఆధారంగా ఉండాలి, దామాషా పద్ధతిలో కాదు. ఆయా సౌకర్యాలు సీమాంధ్రలో కూడా ఏర్పాటు చేయాలి
నేటివిటీ ఆధారంగా ఉద్యోగాల పంపకం ఉండాలి, PF, పెన్షన్లు కూడా ఏ ప్రాంతం వాళ్ళవి అక్కడే ఇచ్చుకోవాలి.
కామన్ హైకోర్టును ఒప్పుకోం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy