KTR అసెంబ్లీ స్పీచ్: as it is

kt

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ T బిల్లు పై అభిప్రాయం చెప్తున్నారు. అసెంబ్లీ లో వారి ఉపన్యాసం యధాతథంగా….
తెలంగాణ బిల్లును స్వాగతిస్తున్నా
ఉద్యమంలో పాల్గొన్నవారందరికీ అభినందనలు
అంబేద్కర్ దూరదృష్టితోనే ఈ బిల్లు చర్చకు వచ్చింది..
గతంలో ఆంధ్రా ప్రజలు ఎదుర్కొన్న బాధలే మేం ఎదుర్కొంటున్నాం..
తెలంగాణ రాష్ట్రం త్వరలోనే ఏర్పడుతుంది
షరతుల ప్రాతిపదికనే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది..
అందరితో చర్చించాకే విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చింది..
తెలంగాణ ఉద్యమం ఆరు దశాబ్దాలుగా జరుగుతోంది..
ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం శాంతియుతంగా నడుస్తోంది
గత 13 ఏళ్లలో ఈ ఉద్యమం గడప గడపకు చేరింది..
తెలంగాణ ఏర్పాటుకు అనివార్యతను ఈ ఉద్యమం కల్పించింది
ప్రణయ్ భాస్కర్ మాట్లాడితే తెలంగాణ పదాన్ని ఉచ్చరించొద్దని అన్నారు..
ఆ నిషేధిత పదం ఇప్పుడు అసెంబ్లీ, పార్లమెంట్ లో ప్రతిధ్వనిస్తోంది..
దానికి కారణం టీఆర్ఎస్
చరిత్రను శైలజానాథ్, కేశవ్ వక్రీకరించారు..
నాణానికి రెండో వైపును నేను చెబుతా
కలిసుండడం వల్ల మాకు నష్టం జరగిందనేది వాస్తవం..
తెలంగాణతో కలవాలని అప్పట్లో ఆంధ్రా నేతలు తపన పడ్డారు
అప్పట్లో కర్నూలులో గుడారాల్లో ఆఫీసులు నడిపారు..
హైదరాబాద్లో కలిసేందుకు ఎన్నో కుట్రలు చేశారు
రూ.4 కోట్ల 49 లక్షల మిగులు ఆదాయం అప్పట్లో తెలంగాణలో ఉండేది..
ఆంధ్రా రాష్ట్రంలో మాత్రం జీతాలిచ్చే పరిస్థితి లేదు
రాజధాని, ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో తెలంగాణలో కలిశారు..
కుట్రల ఫలితంగానే విలీనం జరిగింది
తెలంగాణ ప్రజలు అప్పట్లో కలవడానికి ఇష్టపడలేదు..
కుట్రలు చేసి షరతులతో బలవంతంగా కలిపారు

నేను చెప్పేవన్నీ నిజాలే.. వక్రీకరణలు కాదు
హైదరాబాద్ అసెంబ్లీలో విలీనంపై తీర్మానం, ఓటింగ్ జరగలేదు..
చర్చ మాత్రమే జరిగింది
విశాలాంధ్రను కోరుకున్న కొంతమంది తర్వాత బాధ పడ్డారు..
తెలంగాణను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు
పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించారు..
తెలంగాణ నిధులను ఆంధ్రాకు మళ్లించారు
విలీనం తర్వాత తెలంగాణ ఎప్పుడైనా విడిపోవచ్చని నెహ్రూ చెప్పారు..
ఇందిర గురించి మాట్లాడే వారు నెహ్రూ వ్యాఖ్యలను గుర్తుంచుకోవాలి
మద్రాస్ నుంచి విడిపోవడానికి ఆంధ్రా వాళ్ల పోరాటం కరెక్టైతే మాది కరెక్టే.
ఒక్క ఉద్యోగం కోసం ఆనాడు మద్రాస్ నుంచి విడిపోయారు..
ఇప్పుడు లక్షలాది ఉద్యోగాలు కోల్పోయినా మేం రాష్ట్రం అడగవద్దా..?
నిజాంకు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు పోరాడారు..
ఇప్పుడూ పోరాటం కొనసాగిస్తున్నారు
చిత్తూరు జిల్లా నేతలు చిందులు వేసినా..
కడప నేతలు కత్తులు దూసినా తెలంగాణ రావడం తథ్యం
ఇప్పుడున్న పరిస్థితుల్లో కలిసి ఉండడం సాధ్యం కాదు..
అందరూ ప్రాంతాల వారీగా విడిపోయారు
ఇంకా కలిసి ఉండాలనడం వంచనే అవుతుంది..
మద్రాస్ నుంచి ఆంధ్రా విడిపోవడం విచ్చిన్నం కాదా..?
తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడితే మీకు బాధ ఎందుకు..
జేపీ లాంటి మేధావులు కూడా తెలంగాణ ఆవశ్యకతను గుర్తించారు..
విద్య విషయంలో తెలంగాణ చాలా వెనకబడింది..
ఒక్క గుంటూరు జిల్లాలో 34 ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలుంటే..
మొత్తం తెలంగాణ జిల్లాలో 22 కాలేజీలే ఉన్నాయి
ఏపీపీఎస్సీ నియామకాల్లోనూ తెలంగాణకు అన్యాయం
గ్రూప్ -1 ఇంటర్వ్యూల్లో తెలంగాణ విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చాయి..
ఆంధ్రా వారికి మాత్రం ఇంటర్వ్యూల్లో ఎక్కువ మార్కులు వచ్చాయి
ఇంటర్ లోనూ తెలంగాణ స్టూడెంట్స్ కు అన్యాయం జరిగింది..
72 మార్కులు వచ్చిన విద్యార్థికి 0 మార్కులు వేశారు..
రీ వాల్యుయేషన్ లో వాస్తవం బయటపడింది
610 జీవో ఇప్పటికీ అమలు కాలేదు..
575 జీవోను మాత్రం మూడు నెలల్లో అమలు చేశారు..
తెలంగాణపై కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కిరణ్ మాట తప్పాడు..
బూర్గుల పదవీ త్యాగం చేస్తే రాష్ట్రం ఏర్పడింది
సీమాంధ్ర నేతలు మాత్రం మాకు చేసిందేమీ లేదు
తెలంగాణ పెత్తందారులు, భూస్వాముల గురించి మాట్లాడేవారు..
సీమాంధ్రలోని దళిత బహుజనుల గురించి ఎందుకు మాట్లాడరు..?
రెడీ మేడ్ రాజధాని కోసమే ఆంధ్రా నేతలు హైదరాబాద్ కు వచ్చారు..
హైదరాబాద్ లో ఉన్న నిర్మాణాలన్ని నిజాం కట్టినవే
స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోలేని పరిస్థితి తెలంగాణలో ఉంది..
మాకు స్వయం పాలన, ఆత్మగౌరవం కోరుకోవద్దా..?
తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వనని కిరణ్ అన్న మాట వాస్తవం కాదా..?

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy