రేపు నింగిలోకి G శాట్-31 రాకెట్ ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. జి శాట్-31 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.  ఫ్రెంచ్ గయానాలోని కౌరు ఉపగ్రహం కేంద్రంలో ఈ ప్రయోగానికి సంబంధించి ఇప్పటికే కౌంట్ డౌన్ మొదలైంది. రేపు తెల్లవారు జామున 2 గంటల 31 నిమిషాలకు జి శాట్-31 నింగిలోకి దూసుకెళ్లనుంది. 2,535 కిలోల బరువు, 15 ఏళ్ల జీవిత కాల పరిమితి కలిగిన ఈ ఉపగ్రహం…. కేయూ బ్యాండ్ ట్రాన్స్ పాండర్ సామర్థ్యంతో నిర్ణీత కక్ష్యలో సేవలందించనుంది.

మెరుగైన DSNG అప్ లోడ్స్, డి.టి.హెచ్ ప్రసారాలు, మొబైల్ నెట్ వర్క్స్ కోసం ఈ ప్రయోగం చేపట్టింది ఇస్రో. భారత ప్రధాన భూభాగంతో పాటు ముఖ్యంగా సముద్ర తీరాలు, దీవులకు సంబందించిన సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందించనుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy