LRS గడుపు పెంపు : పెండింగ్ దరఖాస్తులకు మరో అవకాశం

GHMC LRSతెలంగాణ రాష్ట్రంలో భూముల క్రమబద్ధీకరణ పథకం (LRS) గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించింది ప్రభుత్వం. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ బుధవారం (ఏప్రిల్-4) జీవో జారీచేశారు.GHMC, HMDA, కుడా (కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ), DTCP , ఇతర పట్టణ స్థానిక సంస్థల్లో వేలసంఖ్యలో అపరిష్కృతంగా ఉన్న LRS ఫెళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. ఇప్పటికే క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నవారు.. బకాయిపడ్డ సొమ్మును వెంటనే చెల్లించాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ సూచించారు. అవసరమయ్యే పత్రాలను అందజేయనివారు తక్షణమే వాటిని సమర్పించాలన్నారు. అపరిష్కృత ఫైళ్లను పరిష్కరించడానికి కేవలం 25 రోజులే మిగిలి ఉండటం వల్ల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy