LRS, BRS గడువు పెంపు

city viewభవనాలు, స్థలాల క్రమబద్దీకరణ గడువును పెంచింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ పరిధిలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. వేల సంఖ్యలో అప్లికేషన్స్ వచ్చి పడుతుండటంతో.. ఆన్ లైన్ ప్రక్రియలో అంతరాయాలు ఎదురయ్యాయి. సర్వర్లు డౌన్ కావటంతో.. ఆందోళన వ్యక్తం అయ్యింది. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. దీంతో పథకం గడువును మరో రెండు నెలలు పొడిగించాలని నిర్ణయించింది ప్రభుత్వం. దీనికి సంబంధించి అధికారిక ఆదేశాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోనే 65వేల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. మొత్తం 100 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చింది. మరో రెండు నెలలు గడువు పొడిగించటంతో.. మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy