‘మణికర్ణిక’ క్రెడిట్ మంటలు : వాదనకు సాక్ష్యాలు చూపుతున్న క్రిష్

 సినిమా న్యూస్ : దర్శకుడు క్రిష్ జాగర్లమూడి – హీరోయిన్ కంగన రనౌత్ మధ్య వివాదం మరింత పెరిగింది. రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజైన ‘మణికర్ణిక’ సినిమా సక్సెస్ క్రెడిట్ గేమ్ మరింత హీటెక్కింది. ఈ సినిమాను 85శాతం తానే తీశాననీ… దర్శకురాలిగా కంగన తన పేరు వేసుకోవడంపై క్రిష్ చాలా సీరియస్ అయ్యాడు. ఆమెకు నిద్ర ఎలా పడుతుందో అర్థం కావడం లేదని అని ఓ ఇంటర్వ్యూలో క్రిష్ అన్నాడు.

 

ఆ తర్వాత కంగన రనౌత్ వాట్సప్ మెసేజ్ లు బయటకు వచ్చాయి. కంగనా రనౌత్ అక్క రంగోలి చాండెల్ ఈ వాట్సప్ స్క్రీన్ షాట్స్ షేర్ చేసింది. క్రిష్ అవకాశ వాది అని రంగోలి ఆరోపించింది. డిసెంబర్ ఆరున సినిమా చూడాలని క్రిష్ ను కంగన పిలిచిందని .. అప్పుడే ఎందుకు మాట్లాడలేదని చెప్పింది. సినిమాను 85శాతం రీషూట్ చేశామనీ.. అప్పుడే అది కంప్లీట్ సినిమా అయిందని నిర్మాతలు సంతృప్తి చెందారని.. ఆ వాట్సప్ మెసేజ్ లో వివరించింది కంగన. సినిమాను క్రిష్ తీస్తే… 45 రోజుల పాటు… మళ్లీ తాము రీషూట్ చేయాల్సిన అవసరం ఏముంటుందని అందులో కంగన ప్రశ్నించింది.

ఐతే…. కంగన ఇలాంటి రోజు ముందే వస్తుందని తెలిసి ఈ మెసేజెస్ క్రియేట్ చేసిందని క్రిష్ అన్నాడు.  మ్యాగ్జిమమ్ సినిమాను తానే తీశాననీ… 75శాతం సినిమా కంగన తీయలేదని చెబుతున్న మాటలకు బలం ఇచ్చే ప్రూఫ్ లను సోషల్ మీడియాలో షేర్ చేశాడు క్రిష్. విక్కీ జిమ్మీ జిబ్ అనే వ్యక్తి.. క్రిష్ తీసిన సినిమానే 85శాతం అందులో ఉందని.. ఆ పార్టు అంతా బాగుందని చెప్పాడు. తాను తీసిన సినిమా, కంగన తీసిన సినిమా రెండు వెర్షన్లు అతడు చూశాడని క్రిష్ చెప్పాడు.

మణికర్ణికకు పనిచేసి… రీప్లేస్ చేయబడిన ఎడిటర్ సూరజ్.. తనకు పోస్ట్ చేసిన వాట్సప్ మెసేజ్ ను క్రిష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అందులో క్రిష్ ను ఉద్దేశించి “మీరు చేసిన సినిమా మొత్తం అందులో ఉంది. సినిమాను రీషూట్ చేశామని అబద్దాలు చెబుతున్నారు. అందులో 70-75శాతం వరకు నేను ఎడిట్ చేసిన సినిమానే ఉంది. ఈ విషయాన్ని నిర్మాతలైన జీ స్టూడియోస్, కమల్ జైన్ కు మెయిల్ చేశాను. భోజ్ పురి తరహాలో ఎడిటింగ్ ఉందని నన్ను తీసేశారు. కనీసం నాకు క్రెడిట్ కూడా ఇవ్వలేదు” అని సూరజ్ క్రిష్ కు మెయిల్ పంపారు. దీనిపై క్రిష్ ఓ కామెంట్ పెట్టాడు. “ఎవరు ఎంత సినిమా తీశారనేది కాదు మ్యాటర్.  చరిత్రాత్మక సినిమా కావాల్సిన కళాఖండాన్ని నాసిరకమైన అభిరుచితో… నిగూఢమైన ఉద్దేశంతో కొందరు సినిమాను ఎలా నాశనం చేశారో తెల్సుకోవాలి. పరిస్థితులను ఎలా దిగజార్చారో ఇప్పటికైనా తెల్సుకోండి” అని క్రిష్ పోస్ట్ పెట్టాడు.

నటాశా అనే వ్యక్తి తనకు పంపిన వాట్సప్ మెసేజ్ ను కూడా క్రిష్ పోస్ట్ చేశారు. 75 శాతం సినిమా కంగన తీసిందని చెప్పడం అబద్దమే అని అన్నారు. క్రిష్ విజన్ కు… కంగనకు పోలికే లేదని అన్నారు.

 

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy