త్వరలో… వాట్సప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఫీచర్లతో ఒకే యాప్

 టెక్ న్యూస్ : సోషల్ చాటింగ్, సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో… వాట్సప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ మెసెంజర్ లదే హవా. ఈ మూడింటికీ ప్రస్తుతం మూడు ప్లాట్ ఫామ్స్ వేర్వేరుగా ఉన్నాయి. ఐతే… వాట్సప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ మెసెంజర్ లలోని ఫీచర్లను ఇంటిగ్రేట్ చేసేందుకు… టెక్ దిగ్గజం, ఈ సంస్థల ఓనర్ మార్క్ జుకర్ బర్గ్ ప్లాన్ చేశారు. దేనికవే స్పెషాల్ ఫీచర్లు ఉండటం వీటిలో ప్రత్యేకత.

కొత్త సోషల్ నెట్ వర్కింగ్- చాటింగ్ సైట్ లో…  వాట్సప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ మెసెంజర్ ల ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. పంపిన పోస్టుకు రక్షణ కల్పించేలా.. మూడో మనిషి జోక్యం లేకుండా చేసేందుకు.. వీటిలో ఎండ్ – టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ను పొందుపరుస్తారు. నెట్ వర్క్ లోని మరింతమందిని ఈజీ పద్ధతిలో కనెక్ట్ అయ్యేలా ఈ యాప్ ఉంటుందని తెలుస్తోంది. కొత్త యాప్ లో..  ఓ ఫేస్ బుక్ యూజర్… మరో వాట్సప్ యూజర్ కు… నేరుగా అత్యంత రక్షణాత్మక పద్ధతిలో మెసేజ్ ను పంపొచ్చని చెప్పారు సంస్థ ప్రతినిధులు. తాము చేస్తున్న కసరత్తుపై చాలా చర్చలు, సంప్రదింపులు చేశామని తెలిపారు.

 

 

 

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy