MI టీవీ వచ్చేసింది : ప్రపంచంలోనే తేలికైన, సన్నని టీవీ ఇదే

mi-tv
స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో నెంబర్ వన్ గా ఉన్న షావోమి (MI) కంపెనీ టీవీలను బుధవారం(ఫిబ్రవరి14) లాంఛ్ చేసింది. ప్రపంచంలోనే తేలికైన, పలచనైనా LED టీవీగా ప్రకటించింది. 4K డిస్ ప్లేతో.. 55 ఇంచ్ గా స్క్రీన్ తో ఇండియాలో ఇవాళ విడుదల చేసింది. ప్రస్తుతానికి ఒకే మోడల్ అందుబాటులో ఉంది. ఇండియాలో ఈ టీవీ ధర రూ.39వేల 999. MI TV4 55 పేరుతో మోడల్ విడుదల చేసింది. కేవలం 11 బటన్లతో రిమోట్ ఉండటం విశేషం. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్, ఎంఐ స్టోర్లలో మాత్రమే ఈ టీవీ అందుబాటులో ఉంది. ఫిబ్రవరి 22వ తేదీ నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి.
MI TV4 55 స్పెషాలిటీలు :
స్క్రీన్ LED డిస్ ప్లే 55 ఇంచ్ లు ఉంది. 4K టెక్నాలజీ (3840*2160 రెజెల్యూషన్). 2GB ర్యామ్, 8GB ఇంటర్నల్ స్టోరేజీ ఉంది. USB 3.0, USB 2.0 రెండు పోర్ట్ లు ఉన్నాయి. డ్యూయల్ బ్యాండ్. వైఫై, బ్లూటూత్ కూడా కనెక్ట్ అవుతుంది. Dolby, DTS సినిమా ఆడియో క్వాలిటీ ఉంది. 8 వాల్ట్స్ రెండు స్పీకర్స్ ఇన్ బిల్ట్ గా ఉన్నాయి. ఈ టీవీ మందం కేవలం 4.9mm మాత్రమే.
లాంఛింగ్ ఆఫర్స్ :
టీవీతోపాటు కొన్ని ఆఫర్స్ కూడా ప్రకటించింది ఎంఐ. రూ.39,999 చెల్లిస్తే.. సెట్ టాప్ బాక్స్ ఫ్రీ ఇస్తోంది. Mi IR కేబుల్ ద్వారా వాయిస్ కంట్రోల్ ఫీచర్స్ ఇస్తోంది. 5లక్షల కంటెంట్ ఉచితంగా అందుబాటులో ఉంటుందని ప్రకటించింది కంపెనీ. హార్ట్ స్టార్, వోట్, సోనీ హంగామా ప్లే లాంటి 15 ఛానల్స్ కంటెంట్ ను ఉచితంగా చూడొచ్చు. వీటితోపాటు రూ.619 విలువైన రీఛార్జ్ ఉచితం. రూ.1,000 ఫిట్టింగ్ ఛార్జీలు లేవని తెలిపింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy