MI యానివర్సరీ సేల్స్ : రూ.4 ఫ్లాష్ సేల్స్, భారీ డిస్కొంట్స్

షియోమీ.. ఎంఐ(mi) నాలుగేళ్ల వార్షికోత్సం సందర్భంగా.. భారీ ఆఫర్స్, డిస్కొంట్స్ ప్రకటించింది కంపెనీ. ఇండియాలోకి ప్రవేశించిన నాలుగేళ్లలోనే నెంబర్ వన్ గా నిలవటంపై ఆనందం వ్యక్తం చేసింది. ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా.. కేవలం నాలుగు రూపాయలకే ఫ్లాష్ సేల్ నిర్వహిస్తోంది. అంతే కాకుండా 10, 11, 12వ తేదీలు మూడు రోజులు.. భారీ ఆఫర్స్, డిస్కొంట్స్ ప్రకటించింది.

10, 11, 12వ తేదీల్లో ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు రూ.4 ఫ్లాష్‌సేల్‌ నిర్వహిస్తుంది. రూ.4కే ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్‌ టీవీ 4 (55అంగుళాలు), రెడ్‌మి వై1, వై2, రెడ్‌మి నోట్‌5 ప్రో, ఎంఐ బ్యాండ్‌2లను ఫ్లాష్‌సేల్‌ ద్వారా కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. కంపెనీ నిర్వహించే గేమ్ ఆడితే మిక్స్‌2, ఎం మ్యాక్స్‌‌ 2 ఫోన్లను ఉచితంగా గెలుపొందవచ్చు. SBI, PAYTM, MOBIKWIK  చెల్లింపులు చేసేవారు అదనంగా మరికొంత రాయితీని పొందవచ్చు.

ఈ మూడు రోజులు సాయంత్రం 4గంటలకు ఫ్లాష్‌ సేల్స్‌లో మీకు అదృష్టం వరించకపోతే.. కోంబోలో సాయంత్రం 6 గంటలకు రెడ్‌మి నోట్‌ 5ను, ఎంఐ వీఆర్‌ ప్లే 2నుకేవలం రూ.9,999కే (రూ.11,298) అందించనున్నట్టు తెలిపింది కంపెనీ. ఎయిర్‌ ప్యూరిఫైయర్‌, పవర్ బ్యాంక్స్, పాకెట్ స్పీకర్‌లతో ఇతర గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కొంట్స్ ను ప్రకటించింది. ఇక బ్లాక్‌ బస్టర్‌ సేల్స్ కింద.. ఎల్‌ఈడీ స్మార్ట్‌టీవీని రూ.14వేలకు, నోట్‌ 5 ప్రొ ఫోన్‌ను రూ.15వేలకు అందిస్తోంది. ఎంఐ మిక్స్‌2, ఎం మ్యాక్స్‌‌2లపైనా డిస్కొంట్స్ ఇస్తోంది. ప్రతి ఫోన్ పైనా కనీసం వెయ్యి నుంచి రూ.2వేల వరకు డిస్కొంట్ ప్రకటించింది కంపెనీ. నాలుగో వార్షికోత్సవం సందర్భంగా.. ఫుల్ ఆఫర్స్ ఉపయోగించుకోవాలని కోరింది కంపెనీ.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy