ముంబైలో మిరాకిల్.. బాలుడి మీదుగా కారు.. కానీ బతికాడు

 ముంబయిలోని ఘట్ కోపర్ ప్రాంతం అది. అక్కడ గల్లీలో పిల్లలందరూ ఫుట్ బాల్ ఆడుతున్నారు. ఆ సమయంలో ఓ బాలుడు షూ లేస్ కట్టుకునేందుకు రోడ్డు పై పార్క్ చేసి ఉన్న కారు పక్కన కూర్చున్నాడు. అదే సమయంలో ఒక యువతి  ఆ కారు ఎక్కి ముందు చూసుకోకుండా  నిర్లక్ష్యంగా బాలుడి మీద నుంచి కార్ డ్రైవ్ చేసింది.  అయితే అదృష్టం కొద్దీ ఆ బాలుడు కారు మధ్యకు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. కారు వెళ్లిన తర్వాత బాలుడు లేచి తన స్నేహితుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయిన విజువల్స్ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. బాలుడికి స్వల్ప గాయాలయైనట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy