MR వ్యాక్సిన్ ను ప్రారంభించిన మంత్రి ల‌క్ష్మారెడ్డి

vaccine1708తెలంగాణ రాష్ట్రంలో 90 ల‌క్ష‌ల మంది పిల్ల‌ల‌కు MR వ్యాక్సిన్ వేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు ఆరోగ్యశాఖమంత్రి ల‌క్ష్మారెడ్డి.  రాష్ట్రవ్యాప్తంగా గురువారం(ఆగస్టు-17) నుంచి తట్టు (మీజిల్స్), రూబెల్లా వ్యాధుల నివారణ కోసం చిన్నారులకు టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా న‌గ‌రంలోని రాజ్ భ‌వ‌న్ స్కూల్ లో MR వ్యాక్సిన్ ను మంత్రి ల‌క్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ… 9 నెల‌ల నుంచి 15 ఏండ్ల వ‌య‌సు వారికి ఈ టీకా వేస్తార‌ని తెలిపారు. ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల్లో ఈ వ్యాక్సిన్ వేశార‌న్నారు. స్కూళ్ల‌లో 60 ల‌క్ష‌ల మంది పిల్ల‌లు ఉన్న‌ట్లు చెప్పారు. దీనిపై ఎలాంటి అపోహ‌లు లేకుండా ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. 5 వారాల పాటు ఈ వ్యాక్సిన్ వేయ‌నున్న‌ట్లు తెలిపిన ఆయన.. రెగ్యుల‌ర్ వ్యాక్సిన్ తో పాటు MR కూడా తీసుకోవాల‌ని  చెప్పారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy