MRPS క్వశ్చన్స్ : కత్తి సరే.. వీళ్ల బహిష్కరణ సంగతి ఏంటీ

కత్తి మహేష్.. హైదరాబాద్ నగర బహిష్కరణపై స్పందించాయి ఎస్సీ, ఎస్టీ సంఘాలు. పోలీస్ శాఖ నిర్ణయాన్ని తప్పుబడుతూ.. కొన్ని ప్రశ్నలను సంధించారు MRPS అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ. అనాధిగా జరుగుతున్నదే ఇప్పుడూ జరిగిందన్నారు. కత్తి మహేష్ ను బహిష్కరించిన పోలీసులు.. అదే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అధిగమించి పుస్తకాలు రచించిన, ప్రకటనలు చేసిన వారిపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు.

MRPS, ఎస్సీ, ఎస్టీ సంఘాలు సంధించిన ప్రశ్నలు ఇవే :

… సాయిబాబాను దేవుడిగా పూజించే వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారు. అది నేరం కాకుండా పోయిందా. వారిపై ఎందుకు బహిష్కరణ చట్టం ప్రయోగించలేదు?

… మదర్ థెరిస్సాను అవమానించి, కించపరచటం అంటే.. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అధిగమించినట్లు కాదా అని ప్రశ్నించారు. పరిపూర్ణానందకి ఈ నిబంధనలు వర్తించవా?

… హైదరాబాద్ లోనే.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎన్నో సందర్భాల్లో మత, కుల విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు.. పోలీస్ శాఖకు ఈ చట్టం వర్తించలేదా?

… ఏపీ సీఎం చంద్రబాబు.. నాయీబ్రాహ్మణులను కించపరుస్తూ.. ఎక్కువ మాట్లాడితే కత్తిరిస్తా అనటం అంటే ఆ కులాన్ని కించపరటం కాదా.. తెలంగాణ డీజీపీ, ఏపీ డీజీపీకి చెప్పి చర్యలు తీసుకునే విధంగా చేయగలరా?

… వాల్మికి రామాయణం నుంచి సేకరించిన అంశాల ఆధారంగానే రాముడు – కృష్ణుడు వ్యక్తిత్వం, జీవన విధానంపై డాక్టర్ అంబేద్కర్ పుస్తకాన్ని రాసిన విషయాన్ని గుర్తు చేశారు. అందులోని అంశాలనే ప్రస్తావించినట్లయితే.. అదే వాల్మీకి రామాయణాన్ని నిషేధించాలి.. అంబేద్కర్ కు ఇచ్చిన భారతరత్నను వెనక్కి తీసుకోవాలి.. ఈ పని చేయగలరా?

… రామాయణ విష వృక్షం అంటూ రాముడి వ్యక్తిత్వాన్ని ప్రశ్నించిన రంగనాయకమ్మపై ఏం చర్యలు తీసుకుంటారు?

ఇవేమీ తప్పుకానప్పుడు.. ఓ టీవీ ఛానల్ లో రాముడిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన కత్తి మహేష్ పై ఎందుకు బహిష్కరణ చట్టం ప్రయోగించారని నిలదీశారు. కత్తి మహేష్ బహిష్కరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అణగారిన, ఎస్సీ, ఎస్టీలపై ఆది నుంచి అణచివేత జరుగుతూనే ఉందన్నారు. న్యాయం ఒకరి పక్షం మాత్రమే ఉంటుందన్నారు మంద కృష్ణమాదిగ.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy