పేకాట…రూ.200కే హత్య చేశాడు

 గుంటూరులో దారుణం జరిగింది.. ఏటీ అగ్రహారానికి చెందిన పి.వెంకటరమణ(60) పేకాటలో భాగంగా తాను గెలిచిన రూపాయలను ఇవ్వమని కోరితే తలపై బండతో కొట్టి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటరమణతోపాటు పెయింటింగ్‌ పనిచేసే మోహన్‌ మరో నలుగురు కలిసి సోమవారం రాత్రి మందుతాగి.. అగ్రహారం రైలుపట్టాల పక్కన పేకాట ఆడారు. ఈ క్రమంలో ఎన్జీవో కాలనీకి చెందిన మోహన్‌ పేకాటలో ఓడిపోయి వెంకటరమణకు 1000 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. అతను  800 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. మిగిలిన 200 రూపాయలు ఇవ్వమంటూ మోహన్‌ జేబులో వెంకటరమణ చేయిపెట్టాడు. దీంతో కోపంతో ఊగిపోయిన మోహన్‌ పక్కనే ఉన్న బండతో వెంకటరమణ నెత్తిమీద కొట్టాడు.  వెంకటరమణ అక్కడికక్కడే మృతిచెందాడు.

పి.వెంకటరమణ (60) సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. అతని కోసం కుటుంబ సభ్యులు వెతుకుతుండగా మంగళవారం ఏటీ అగ్రహారంలోని బ్రహ్మంగారి గుడి వద్ద ఓ ముసలాయిన చనిపోయి ఉన్నాడనే సమాచారంతో వెళ్లి పరిశీలిస్తే వెంకటరమణగా గుర్తుపట్టారు. దాంతో అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి  తీసుకువెళ్లి దహన సంస్కారాలకు సిద్ధం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. దహన కార్యక్రమాన్ని ఆపి దర్యప్తు చేయడంతో వెంకటరమణను మోహన్‌ కొట్టి చంపినట్లు నిర్ధారణకు వచ్చారు. నిందితుడు మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నారని సమాచారం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy