రామ్- పూరీ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో హీరోయిన్ గా నభా నటేష్

 ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మొదటిసారి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘ ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. మరో హీరోయిన్ గా నభా నటేష్ ను ఎంపిక చేశారు నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్ లో వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఇస్మార్ట్ శంకర్. భారీ యాక్షన్ సీక్వెన్స్ లను ఈ షెడ్యూల్ లో తెరకెక్కిస్తున్నారు.

రామ్ సరికొత్తగా, స్టైలిష్ గా కనిపిస్తున్న ఈ చిత్రంలో పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి మరియు గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ పతాకాలపై పూరీ, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను మే లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు : రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభా నటేష్, పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాన్షు పాండే, మధు సింగంపల్లి, కుల్దీప్ సింగ్, దీపక్ శెట్టి.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy