వార్ హీరోకు లాస్ట్ సెల్యూట్.. ఎయిర్ మార్షల్ రణధీర్ సింగ్ కు నివాళి

చండీగఢ్ :  97 ఏళ్ల ఎయిర్ మార్షల్ రణధీర్ సింగ్. ఆయన పేరు చెబితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అందరూ అటెన్షన్ అవుతారు. మనసులో సెల్యూట్ చేస్తారు. భారత్.. పాకిస్థాన్ తో జరిపిన యుద్ధాల్లో ఓ హీరో ఆయన. ఇండియా ఎయిర్ బేస్ ను కాపాడుతూ.. శత్రుసైన్యం వైమానిక స్థావరాలను ధ్వంసం చేసిన వీరుడాయన. స్వతంత్రానికి పూర్వం ఎయిర్ ఫోర్స్ లో చేరి.. అత్యున్నత సేవలు అందించి.. సుదీర్ఘ కాలం జీవించిన ఎయిర్ ఫోర్స్ వార్ హీరోల్లో ఆయన ఒకరు.

1963, 1971 పాకిస్థాన్ తో యుద్ధాల సమయంలో.. అతడి తెలివితేటలకు.. ఎయిర్ ఫోర్స్ లోనే అత్యున్నత పురస్కారాలైన అతి విశిష్ట్ సేవా మెడల్ , పరమ విశిష్ట్ సేవా మెడల్స్ దాసోహమన్నాయి. సెకండ్ వరల్డ్ వార్ లో ఆయన సేవలందించారు. 1948 తొలి కశ్మీర్ యుద్ధం.. 1962 ఇండియా- చైనా వార్, ఇండో పాక్ మధ్య 1962, 1965, 1971 ఏళ్లలో ఎయిర్ ఫోర్స్ కమాండర్ గా విశిష్టమైన సేవలు అందించారు.

క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన కొద్దిరోజులకే.. 1942 డిసెంబర్ 21 న… రణధీర్ సింగ్ రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్నారు. 1943లో కోహన్(ఇపుడు పాక్ లో ఉంది) తొలిసారిగా పైలట్ ఆఫీసర్ గా నియమితులయ్యారు. దేశ విభజన సమయంలో.. రణధీర్ సింగ్.. ఫ్లైట్ లెఫ్టినెంట్ అధికారిగా చిన్నవయసులోనే ప్రమోషన్ పొందారు. పెషావర్ లోని నౌషెరా జిల్లా రిసాల్ పురా ఎయిర్ బేస్ లో పనిచేశారు.

స్వతంత్రానికి కొద్దిరోజుల ముందు పాకిస్థాన్ లోని తమ 12వ ఎయిర్ బేస్ ను .. ఢిల్లీలోని పాలం ఎయిర్ బేస్ కు తరలించాలని ప్రభుత్వాన్ని రణధీర్ సహా పలువురు కోరారు. స్వతంత్రం వచ్చిందనడానికి సంకేతంగా.. భారత మూడు రంగుల జాతీయ జెండాను మొదటిసారిగా ఎర్రకోట మీదుగా.. ప్రత్యేక ఎయిర్ క్రాఫ్ట్ లో ప్రయాణిస్తూ ప్రదర్శించిన వ్యక్తుల్లో రణధీర్ సింగ్ కూడా ఒకరు.

1947లో జమ్ముకశ్మీర్ లో చొరబాటుదారులను ఏరివేసేందుకు జరిగిన పోరాటంలో.. 185 గంటలపాటు ఫ్లైట్ ను నడిపాడు రణధీర్ సింగ్. నంబర్ 7 స్క్వాడ్రాన్ లెఫ్టినెంట్ హోదాలో ఆయన చూపిన ధైర్యం, తెగువకు.. స్వతంత్ర భారతంలోనే మొట్టమొదటి వీరచక్ర పురస్కారం.. రణధీర్ సింగ్ ను వరించింది.

1965, 1971 ఏళ్లలో… పాకిస్థాన్ తో జరిగిన యుద్ధాల్లో తన తెలివితేటలను, అసమాన ధైర్యసాహసాలను, సమయస్ఫూర్తిని ప్రదర్శించి.. ఎయిర్ బేస్ ప్రాపర్టీని ధ్వంసం కాకుండా కాపాడారు రణధీర్ సింగ్. ఆ సమయంలో రణధీర్ సింగ్ అదమ్ పూర్ ఎయిర్ కమాండర్ పదవిలో ఉన్నారు. అదను చూసి శత్రు సైన్యంపై దాడులు చేయించారు. పాక్ ఎయిర్ ఫోర్స్ ఎటాక్ చేసినప్పుడు రక్షణాత్మకంగా వ్యవహరించారు. ఎక్కువసార్లు ఎటాకింగ్ చేయించడంలో సక్సెసయ్యారు. అలా.. అద్భుతమైన ప్లానింగ్ తో రెండు విధాలుగా… అదమ్ పూర్ ఎయిర్ బేస్ కు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తగా సైన్యానికి కమాండ్ చేశారు. ఇంతటి ప్రతిభ చూపినందుకే… రక్షణ శాఖ ఆయనను 1965లో అతి విశిష్ట్ సేవా మెడల్… 1971లో పరమ్ విశిష్ట్ సేవా మెడల్ అందించి గౌరవించింది.

ఎయిర్ మార్షల్ రణధీర్ ఏప్రిల్ 1978లో రిటైర్మెంట్ తీసుకున్నారు. అప్పటినుంటి చండీగఢ్ లో సెటిల్ అయ్యారు. కొన్నేళ్లపాటు వేధించిన వ్యాధి కారణంగా.. ఆయన 97 ఏళ్ల వయసులో చండీగఢ్ లో కన్నుమూశారు. ఇటీవల.. సెప్టెంబర్ 18వ తేదీన ఈ మాజీ ఎయిర్ మార్షల్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ “వార్ హీరో” తుది శ్వాస విడిచారు. పూర్తిస్థాయి మిలటరీ గౌరవాలతో చండీగఢ్ లోని సెక్టార్ – 25 స్మశానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన కొడుకు, రిటైర్డ్ వింగ్ కమాండర్ అయిన ప్రదీప్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించారు.

రణధీర్ సింగ్.. ప్రతిరోజు వాకింగ్ చేసేవారని.. అందుకే ఫిట్ గా ఉంటూ అంతకాలం బతకగలిగారని సన్నిహితులు చెబుతారు. అందరూ పైకి వెళ్తారని అంటారు.. కానీ రణధీర్ సింగ్ విషయంలో మాత్రం భిన్నంగా స్పందించారు ఆయనకు బాగా దగ్గరైన వాళ్లు. “ ఫేర్ వెల్ సర్.. హ్యాపీ ల్యాండింగ్ “ అంటూ ట్వీట్ చేశారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy