అటల్ అంత్యక్రియలు పూర్తి.. తలకొరివి పెట్టిన దత్తపుత్రిక

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిశాయి. శుక్రవారం (ఆగస్టు-17) ఢిల్లీలోని BJP హెడ్ ఆఫీస్ నుంచి యమునా నది తీరంలోని స్మృతి స్థల్ వరుకు జరిగిన అంతిమ యాత్రలో అభిమానులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. అభిమానులు, బీజేపీ క్యాడర్ తో దీన్ దయాల్ మార్గ్ కిక్కిరిసిపోయింది. ప్రధాని మోడీ, అమిత్ షా..ఇతర నేతలు అంతిమయాత్రలో అభిమానుల వెంట నడిచారు. స్మృతిస్థల్ వరకు నాలుగు కిలోమీటర్ల మేర జనంతో కదిలారు.

అంత్యక్రియల సమయంలో వాజ్ పేయి పార్ధివదేహానికి చివరిసారి నివాళులర్పించారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోడీ, AICC ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, LK అద్వాని, మన్మోహన్ సింగ్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, అధికారులు. తర్వాత వాజ్ పేయి భౌతికకాయానికి త్రివిద దళాలు గౌరవ వందనం సమర్పించాయి. అంత్యక్రియలకు భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ వాంగ్ చుక్, ఆఫ్గనిస్థాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, శ్రీలంక విదేశాంగ మంత్రి లక్ష్మణ్ కిరియెల్లా, బ్రిటీష్ హైకమిషనర్ డొమినిక్ అస్కిత్, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి అబుల్ హసన్ ఆలీ, నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ జ్ఞావలి  హాజరయ్యారు.

వాజ్ పేయి భౌతికకాయం మీద ఉంచిన త్రివర్ణ పతాకాన్ని ఆయన మనువరాలు నిహారికాకు అందజేశారు.  తాత అటల్‌ జీ నుంచి తరచుగా బహుమతులు అందుకునే నిహారిక చివరి కానుకగా ఆయన పార్థీవదేహంపై కప్పిన జాతీయ పతాకాన్ని అందుకున్నారు. ఉద్వేగానికి లోనవుతూ త్రివర్ణ పతాకాన్ని వెంట తీసుకెళ్లారు మనవరాలు నీహారిక.

హిందూ సంప్రదాయం ప్రకారం వేద పండితుల సాయంతో వాజ్‌ పేయి అంత్యక్రియలు నిర్వహించారు. దత్త పుత్రిక నమితా భట్టాచార్య తలకొరివి పెట్టారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy