NRIలతో సమావేశం : కువైట్ కు కాంగ్రెస్ టీమ్

CONGకువైట్ లో వలస కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ బృందం సిద్ధమైంది. బుధవారం (ఫఇబ్రవరి-14) రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కుంతియా నాయకత్వంలో పార్టీ బృందం కువైట్ వెళ్తోంది. కాంగ్రెస్ నాయకులు మూడురోజలు పాటు కువైట్ లోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తారు. ప్రవాస భారతీయ కార్మికుల కోసం కువైట్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించడంతో అక్కడ తెలంగాణ కార్మికుల సమస్యలు తెలుసుకోవడానికి కాంగ్రెస్ బ్రుందం వెళుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా ఆధ్వర్యంలో.. AICC, INTUC, TPCC-గల్ఫ్ NRI విభాగం ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు. గురువారం (ఫిబ్రవరి-15) నుంచి ఈ నెల 17 వరకు ఈ బృందం కువైట్ లో పర్యటించనుంది.

కువైట్ ప్రభుత్వం జనవరి 29 నుంచి ఫిబ్రవరి 22 వరకు.. ఇమిగ్రేషన్, నివాస చట్టాలను ఉల్లంఘించిన వారు ఎలాంటి జరిమానా, జైలు శిక్ష లేకుండా తమ దేశాలకు వెళ్లిపోయే అవకాశం కల్పించింది. కువైట్ లో 30 వేలమంది భారతీయ కార్మికులు అనధికారికంగా ఉంటున్నట్లు అంచనా. వీరిలో 5 వేల మంది తెలంగాణ కార్మికులున్నారని తెలుస్తోంది.

కువైట్ లో వలస కార్మికులను ఆదుకోవాలని ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశామన్నారు కాంగ్రెస్ నాయకులు. తిరిగి వచ్చే కార్మికులకు పునరావాసం కల్పించాలంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy