OMG : డ్రగ్స్ కేసులో ఇంటర్నేషనల్ లింక్

kamingaడ్రగ్స్ కేసు విచారణ జరిగే కొద్దీ దిమ్మతిరిగే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు నైజీరియన్స్ మాత్రమే పట్టుబడగా.. ఇప్పుడు నెదర్లాండ్ వ్యక్తిని సిట్ అధికారులు అరెస్ట్ చేయటం సంచలనం అయ్యింది. కొకైన్ సరఫరాలో మైకా కమింగా కీలక వ్యక్తి అని.. అతని నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ప్రకటించారు. 33 ఏళ్ల కమింగా నాలుగు సార్లు భారత్ వచ్చాడని.. విజిటింగ్ వీసాపై తిరుగుతున్నాడని చెప్పారు. 2018 వరకు వీసా ఉందన్నారు.

మల్లీ నేషనల్ కంపెనీలోని ఉద్యోగులకు మైకా కమింగా ద్వారానే డ్రగ్స్ సరఫరా అవుతుందని.. హైటెక్ సిటీ ఏరియాలో పని చేసే చాలా మంది సాప్ట్ వేర్ ఉద్యోగులకు ఇచ్చాడని తెలిపారు. ప్రస్తుతం మైకా దగ్గర భారత్ పాస్ పోర్ట్ కూడా ఉందని.. దాని గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్నాడని వెల్లడించారు. డ్రగ్స్ సరఫరా మూలాలను సైతం పెకిలించే దిశగా సాగుతున్న సిట్ విచారణలో ఇది కీలక పరిణామం అన్నారు అకున్.  చార్మి విచారణ సమయంలోనే కమింగా అరెస్ట్ చూపించటంతో కలకలం రేగింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy