OMG : పదేళ్లుగా కడుపులో LED బల్బు

bulb-inside-stomachకడుపులో సూదులు చూశాం.. కణుతులు చూశాం.. తాజాగా LED బల్బుతో ఓ వ్యక్తి సంచలనం సృష్టించాడు. సౌదీకి చెందిన ఓ వ్యక్తి కడుపు నుంచి LED బల్బును బయటకు తీశారు డాక్టర్లు. సౌదీలోని అల్ అషాకు చెందిన 21ఏళ్ల యువకుడు కడుపునొప్పి, వాంతులతో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. వెంటనే సీటీ స్కాన్ చేసిన డాక్టర్లు.. అతని కడుపులో అనుమానాస్పద వస్తువును గుర్తించారు. ఏంటా అని చూస్తే అది బల్బు. ఆపరేషన్ చేసిన డాక్టర్లు.. దాన్ని బయటకు తీశారు. అసలు విషయంలోకి వెళితే… సంబంధిత వ్యక్తి 10 ఏళ్ల వయస్సులో అనుకోకుండా చిన్న LED బల్బ్ ను మింగేశాడు. అది పేగుల్లోకి వెళ్లి అలాగే ఉండిపోయింది. ఇన్నేళ్లకు అది ఇలా బయటకు వచ్చింది. విశేషం ఏంటంటే.. ఆ బల్బు కండీషన్ అద్భుతంగా ఉందట. ప్లగ్ లో పెట్టి చూస్తే వెలిగిందట. స్థానిక అల్ అరేబియా అనే వెబ్ సైట్ ఈ న్యూస్ ను రిపోర్ట్ చేసింది.

One Response to OMG : పదేళ్లుగా కడుపులో LED బల్బు

  1. Anonymous says:

    Led bulbs 4,5 years madyalo vachai kani 11 years before ela mingadu

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy