
మహారాష్ట్ర మాలెవగావ్ ప్రాంతానికి చెందిన అశోక్, ధన్వితి ఫ్యామిలీ. పారిశ్రామివేత్తలు. వీరికి ఆరుగురు కుమార్తెలు. పెద్దమ్మాయి 30 ఏళ్ల హీనా డాక్టర్. ఇటీవలే జైన్ సాద్వీగా మారింది. సూరత్ లోని ఆచార్య యశోవర్మ సురిష్వర్ నుంచి సాద్వీగా మారింది. ఇంట్లోవారి మాటలను కాదని.. సాద్వీగా మారింద. డాక్టర్ ఎందుకు చదివారు అంటే.. మా నాన్న కోరిక డాక్టర్ కావాలని అందుకే చదివాను. కొన్నాళ్లు ప్రాక్టీస్ చేశాను. సాద్వీగా మారాలనేది నా కోరిక అందుకే స్వీకరించాను అని చెబుతోంది హీనా. 17 ఏళ్ల వయస్సు 45 రోజులు జైన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడే సాద్వీగా మారాలనే ఆలోచన వచ్చినట్లు చెబుతోంది. తల్లి ధన్వితి కుటుంబం నుంచి ఇప్పటికే 12 మంది సామాజిక సేవలో ఉన్నారు. అదే బాటలో పయనించటానికి తల్లి నిరాకరించినా.. హీనా మాత్రం అటువైపే వెళ్లింది.