పవన్ కళ్యాణ్ కాన్వయ్ కు ప్రమాదం.. 8 మందికి గాయాలు

 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయానిస్తున్న కాన్వాయ్ గురువారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఇందులో ఎనిమిది మంది సెక్యురిటీ సిబ్బంది గాయపడ్డారు. పవన్ ప్రయానిస్తున్న కారు మాత్రం సురక్షితంగా ఉంది. దీంతో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు. గురువారం  రాత్రి కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్‌.. పలు ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. అనంతరం రాజానగరంలో జనసేన సభలో పాల్గొనడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

రంగంపేట మండలంలోని రామేశంపేట వద్ద పవన్ ప్రైవేట్ భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనం లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో 8 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన వారిలో అరవింద్, శివ, కె. శ్రీకాంత్, నవీన్‌, రామకిశోర్‌, జావీద్‌, బాబి, బి. శ్రీకాంత్‌ ఉన్నారు. గాయపడిన వారిని రాజానగరం సమీపంలోని జీఎస్‌ఎల్‌ ఆస్పత్రిలో చేర్పించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy