PNB స్కాం కేసు : నీరవ్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ

Nirav-Modi NON BAILపంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, ఆయన మేనమామ, గీతాంజలి జెమ్స్  చీఫ్ మెహుల్ చోక్సీలపై నాన్-బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు 13 వేల కోట్ల రూపాయల ఎగవేసి పరారైన కేసులో నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలపై నడుస్తున్న కేసులో ఆదివారం (ఏప్రిల్-8) ముంబయిలోని CBI కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ముంబయిలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ నుంచి అక్రమంగా లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్స్ పొంది… హాంకాంగ్ లోని అలహాబాద్, యాక్సిస్, SBI బ్రాంచ్ ల నుంచి వేల కోట్లు డ్రా చేశారు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ. వీరిద్దరూ దేశం వదిలి పారిపోయారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy