PNB స్కాం : నీరవ్ కుటుంబీకులకు సమన్లు

pnbపంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (PNB) స్కాం కేసులో ఇప్పటికే సీబీఐ రెండు ఛార్జ్‌షీట్లను దాఖలు చేసింది. తాజాగా ఈ స్కాంను దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, నీరవ్‌ మోడీ కుటుంబీకులకు సమన్లు జారీచేసింది. కుంభకోణానికి పాల్పడి దేశం విడిచి పారిపోయిన నీరవ్‌ మోడీ తండ్రి దీపక్‌ మోడీ, సోదరి పూర్వి మెహతా, ఆమె భర్త మయాంక్‌ మెహతాలకు సమన్లు జారీచేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. PNB స్కాం కేసు విచారణలో భాగంగా ఈ సమన్లను పంపినట్లు తెలిపింది. ఈ కేసు విచారణలో భాగంగా వచ్చే వారం మనీ లాండరింగ్‌ నిరోధక చట్టానికి చెందిన స్పెషల్‌ కోర్టులో హాజరు కావాలని వీరికి ఆదేశాలు జారీచేసినట్టు ఈడీ ఇన్వెస్టిగేటర్లు తెలిపారు. ముంబై ఆఫీసులో వీరి వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు. మే మొదటి వారంలోనే నీరవ్‌ మోడీ బంధువులకు సమన్లు జారీచేశామని ఈడీ ఇన్వెస్టిగేటర్లు చెప్పారు. తమ ముందు హాజరు కావడానికి వారికి 15 రోజుల టైం ఇచ్చినట్లు తెలిపారు.

నీరవ్‌ తండ్రి దీపక్‌ బెల్జియంకు చెందిన వాడు కాగ.. పూర్వి ఆమె భర్త హాంకాంగ్‌లో స్థిరపడ్డారు. మెయిల్‌ ద్వారా ఈ సమన్లను అధికారులు వారికి జారీచేశారు. పూర్వి ఇప్పటికే ఈడీ కనుసన్నల్లో ఉన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా భారత్‌కు మనీ లాండరింగ్‌కు పాల్పడటానికి నీరవ్‌కు ఆమె సహకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆమె భర్త కూడా ఇదే కార్యకలాపాలతో నీరవ్‌కు సాయపడినట్టు తెలుస్తోంది. వీరందరూ కలిసి 2011 నుంచి 2017 మధ్యలో ముంబైలోని బ్యాంకుకు చెందిన బ్రాడీ హౌజ్‌ బ్రాంచు ఆఫీసర్లతో కలిసి ఈ కుంభకోణానికి పాల్పడినట్టు తెలిసింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy