కృష్ణయ్య ప్రేమ ప్రయాణం..!

Ra_Ra_Krishnayya_Movie_Wallpapers(1)రారా.. కృష్ణయ్య సినిమాతో జగపతి బాబుకు లెజెండ్ స్థాయిలో మంచి పేరు వస్తుందని ఆ సినిమా దర్శక-నిర్మాతలు అంటున్నారు. సందీప్ కిషన్, రెజీనాలు జంటగా నటిస్తున్న ‘రారా.. కృష్ణయ్య’ లో జగపతి బాబు కీ రోల్ పోషిస్తున్నారు. యస్.వి.కె.పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో జగపతి బాబు సందీప్ కు అన్నయ్య పాత్రలో నటిస్తున్నారు. అచ్చు మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో రీసెంట్ గా విడుదలైంది. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని, సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని తెలిపారు. డైరెక్టర్ మాట్లాడుతూ.. కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని తెలిపారు. ఒ అబ్బాయి, అమ్మాయిల ప్రేమ ప్రయాణం.. అందులో వారు పొందిన అనుభూతి, వింత అనుభవమే ఈ సినిమా బ్యాక్ డ్రాప్ అని తెలిపాడు. జగపాతి పాత్ర ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని అన్నాడు. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలిపాడు. ఇక ఈ సినిమాలో కళ్యాణి, తనికెళ్ల భరణి, రవిబాబు, బ్రహ్మాజీ, కాశీ విశ్వనాథ్, చలపతిరావు, తాగుబోతు రమేష్ లాంటి యాక్టర్స్ నటిస్తున్నారు.

రా రా కృష్ణయ్య మూవీ స్టిల్స్ మీకోసం…

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy