బీజేపీ నేత సక్సెస్ స్టోరీ: ఒకప్పుడు చెత్త ఏరుకునేవాడు.. నేడు మేయర్

రాజేష్ కలియా, చండీగఢ్ బీజేపీ చీఫ్ సంజయ్ టాండన్

నిరుపేద కుటుంబంలో వాల్మీకి బోయ కుటుంబంలో పుట్టాడు.  చిన్నప్పుడు స్కూల్ ముగిశాక రోడ్డు పక్కన చెత్త ఏరి.. అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో కుటుంబానికి చేదోడువాదోడుగా ఉన్నాడు. కుర్ర వయసులో ఉన్నప్పుడు ఆరెస్సెస్ లో యాక్టివ్ గా పనిచేశాడు. రాజకీయ నాయకుడిగా మారి.. నేడు చండీగఢ్ నగర మేయర్ గా ఎన్నికయ్యాడు. హర్యానా బీజేపీ నేత రాజేష్ కలియా (46) సక్సెస్ స్టోరీ ఇది.

ఆరెస్సెస్ నుంచి..

హర్యానాలోని సోనిపట్ జిల్లా అహులానా గ్రామంలో పుట్టాడు రాజేష్ కలియా. ఆయన కుటుంబం 1977లో చండీగఢ్ కు వలస వెళ్లింది. అక్కడ చిన్నప్పడు స్కూల్ కు వెళ్లి చదువుకుంటూనే సాయంత్రం తన అన్నదమ్ములంతా కలిసి రోడ్డు పక్కన చెత్త ఏరేవారు. పెద్దయ్యాక ఆరెస్సెస్ కార్యకర్తగా చేరి కీలకంగా పనిచేశారు. తర్వాత కాలంలో బీజేపీలో చేరారు. రెండు సార్లు వరుసగా చండీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్లో 7వ వార్డు నుంచి మెంబర్ గా గెలిచారు. జనవరి 19న జరిగిన మేయర్ ఎన్నికలో మొత్తం 27 మంది వార్డు మెంబర్లలో 16 మంది రాజేష్ కు మద్దతిచ్చారు. దీంతో ఆయన మేయర్ గా ఎన్నికయ్యారు.

ఫస్ట్ ప్లేస్ కు తేవాలి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చిన్నప్పుడు చెత్త ఏరినందుకు సిగ్గు పడడం లేదన్నారు. కష్టం తెలిసిన వాడిగా పేదలకు సాయపడతానని చెప్పారు. ఇప్పటికీ తన అన్న మునిసిపాలిటీ స్వీపర్ గా పని చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో స్వచ్ఛ నగరాల్లో మూడో స్థానంలో ఉన్న చండీగఢ్ ను మొదటి స్థానానికి తేవడమే తన ముందున్న లక్ష్యమని ఆయన చెప్పారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy