140 మిలియన్ వ్యూస్‌తో రికార్డు సృష్టిస్తున్న ‘2.ఓ’

 సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘2.ఓ’. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాష్ కరణ్ నిర్మించారు. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే తొలిసారి 600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకుంది. ఈ సినిమా నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చెన్నైలో గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయని ఈ ట్రైలర్‌కి వచ్చిన వ్యూస్ చూస్తే అర్థమవుతుంది. కేవలం పది రోజుల్లోనే 140 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి రికార్డు సృష్టించింది ‘2.ఓ’. సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన ఎమీ జాక్సన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ విలన్ పాత్ర పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, సినిమాటోగ్రఫీ: నిరవ్‌షా, ఎడిటింగ్: ఆంటోని, నిర్మాత: సుభాష్ కరణ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy