RBI కొత్త గవర్నర్ గా శక్తికాంత దాస్

భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) కొత్త గవర్నర్‌గా శక్తికాంత దాస్ నియమితులయ్యారు.ఆయన మాజీ ఫైనాన్స్ సెక్రటరీ, ప్రస్తుత ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు. నిన్న(సోమవారం) ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో కేంద్ర ప్రభుత్వం శక్తికాంత దాస్‌ను ఇవాళ (మంగళవారం) ఆ పదవిలో నియమించింది. RBI 25వ గవర్నర్‌ గా దాస్ బాధ్యతలు చేపట్టబోతున్నారు.

IAS అధికారి అయిన శక్తికాంత దాస్ గతంలో రెవెన్యూ, ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేశారు. గతేడాది పదవీ విరమణ పొందిన తర్వాత 15వ ఆర్థిక కమిషన్‌ను సభ్యులుగా నియమితులయ్యారు. కేంద్ర బ్యాంకుతో సన్నిహితంగా పని చేసిన అనుభవం దాస్‌కు ఉంది. G20 సదస్సులలో ప్రభుత్వ ప్రతినిథిగా హాజరయ్యారు. 2016లో రూ.500, రూ.1,000 నోట్ల రద్దుకు ప్రధాని మోడీకి సహకరించినవారిలో దాస్ ఒకరు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy