RBI చెబుతోంది : క్యాష్ ఆన్ డెలివరీ చట్టబద్ధం కాదు

ఈ రోజుల్లో అమెజాన్, ఫ్లిఫ్ కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్ధల నుంచి  ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా క్యాష్ ఆన్ డెలివరీకే (COD) ఎక్కువ ఇంపార్టెంట్స్ ఇస్తున్నారు వినియోగదారులు. దేశంలోని ఈ- కామర్స్ సంస్ధల లావాదేవీలలో సగం క్యాష్ ఆన్ డెలివరీపైనే నడుస్తున్నాయి. అయితే ఈ-కామర్స్ సెక్టార్ లో క్యాష్ ఆన్ డెలివరీ పేమెంట్ విధానం చట్టబద్దం కాదని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) తెలిపింది. క్యాష్ ఆన్‌ డెలివరీ పేమెంట్స్‌ అండ్‌ సెటిల్‌ మెంట్స్‌ సిస్టమ్స్‌ చట్టం 2007లోని సెక్షన్‌ 8 ప్రకారం అధికారికమేనా అని ఓ ఆర్టీఐ యాక్టివిస్ట్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆర్బీఐ ఈ విధంగా తెలిపింది.

ఫ్లిప్‌ కార్ట్‌, అమెజాన్ వంటి ఈ-కామర్స్‌ సంస్థలు చెల్లింపుల్లో మధ్యవర్తులుగా ఉండటం చట్టం పరిధిలోకి రాదని, COD కి సంబంధించి ఇప్పటివరకూ తాము ఏ విధమైన నిబంధనలు జారీ చేయలేదని రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా తమ సమాధానంలో తెలిపింది. క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఫెసిలిటీని ‘గ్రే ఏరియా’లానే ఆర్బీఐ పరిగణిస్తోందని, దానిపై ఏ విధమైన స్పష్టమైన నియమాలు లేవని తెలిపింది. 2010లో వినియోగదారులకు మరింత దగ్గరయ్యేందుకు ఫ్లిఫ్ కార్ట్  COD ఫెసిలిటీని తీసుకొచ్చింది. దేశంలోని సగంపైగా ఈ-కామర్స్‌ సంస్థలు ఈ సదుపాయాన్ని యూజర్లకు అందుబాటులో ఉంచాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy