RBI షాక్ : సీసీ టీవీ ఫీడ్ డిలీట్ చేయొద్దు

rbiనోట్ల మార్పిడిలో బ్యాంకుల నిర్వాకంపై సీరియస్ యాక్షన్ కు రెడీ అయ్యింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశవ్యాప్తంగా 5వేల బ్యాంక్ బ్రాంచీల్లో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చింది. అన్ని కోణాల్లో విచారణకు సిద్ధం అయ్యింది. ఐటీ, సీబీఐ, పోలీస్ తనిఖీల్లో కోట్లకు కోట్ల కొత్త నోట్లు దొరకటంపై విచారణను మరింత లోతుగా చేయాలని నిర్ణయించినట్లు RBI అధికారి ఆర్.గాంధీ వెల్లడించారు. నోట్ల మార్పిడిలో అక్రమాలు జరిగినట్లు గుర్తించాం అని.. బ్యాంక్ ఆడిటింగ్ లో అన్ని బయటపడతాయని ప్రకటించారు. బ్యాంక్ సిబ్బందిపై కేసులు పెడతామని కూడా తెలిపారు.

రంగంలోకి విజిలెన్స్ టీమ్స్

బ్యాంకుల్లో అక్రమాలపై విచారణ ప్రారంభించింది విజిలెజ్స్. ప్రతి బ్రాంచ్ లో ఓ బృందం తనిఖీ చేపట్టింది. అనుమానం ఉన్న ఖాతాలను పరిశీలించి.. బ్యాంక్ సిబ్బందికి నోటీస్ ఇస్తున్నారు. బ్యాంక్ కార్యకలాపాలపైనా నిఘా పెంచారు. నవంబర్ 8వ తేదీ నుంచి డిసెంబర్ 30వ తేదీ అన్ని బ్యాంకుల్లోని సీసీ కెమెరా ఫుటేజ్ ను భద్రపరచాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. అన్ని బ్యాంకుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని.. అన్ని కౌంటర్లు కవర్ అయ్యే విధంగా ఉండాలని అక్టోబర్ 27వ తేదీనే అన్ని బ్యాంకులకు సర్క్యూలర్ వచ్చింది. ఈ ఆదేశాలకు గుర్తుచేస్తూ.. నోట్ల రద్దు నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు బ్యాంక్ లోని మొత్తం ఫుటేజ్ ను భద్రపరచాలని.. డిలీట్ చేయొద్దని స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది RBI.

One Response to RBI షాక్ : సీసీ టీవీ ఫీడ్ డిలీట్ చేయొద్దు

  1. Anonymous says:

    HUB HOGA MAZA

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy