తెలంగాణ బిల్లుపై రేవంత్ రెడ్డి స్పందన: as it is…

revతెదేపా తెలంగాణా ప్రాంత ప్రధాన నాయకులలో ఒకరైన యువ నాయకుడు రేవంత్ రెడ్డి T బిల్లు పై సుదీర్ఘంగా, ఉద్వేగంగా ఉపన్యసించారు. ఆయన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే…

తెలంగాణ పోరాటంలో ఎంతోమంది అమరులయ్యారు
తెలంగాణ వీరులను స్మరించుకోవడం మన బాధ్యత
రజాకార్ల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర తెలంగాణది
ఏడాది ఆలస్యంగా తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చింది
దేశంలోని మిగతా ప్రాంతాలతో పోల్చితే మాకు తీవ్ర అన్యాయం జరిగింది
మద్రాస్ నుంచి ఆంధ్రా విడిపోయింది డిసెంబర్ 9నే
పొట్టి శ్రీరాములు త్యాగం గొప్పదైతే.. తెలంగాణ అమరవీరుల పోరాటం గొప్పది కాదా..?

ఆంధ్రా ఆధిపత్యం కోసం ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టారు..
భాషా ప్రయుక్త రాష్ట్రాల వాదనకు కాలం చెల్లింది..
దోచుకోవడానికే ఇంకా భాషా ప్రయుక్త రాష్ట్రాలని అంటున్నారు..
అధికారికంగా ఉన్న ఉర్దూ భాషను పక్కనబెట్టి ఇంగ్లీష్ ను తెరపైకి తెచ్చి మా ఉద్యోగాలు కొల్లగొట్టారు..
మమ్మల్ని చెప్రాసీలకే పరిమితం చేశారు..
1969లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది ఖమ్మంలోనే..
ఆ ఉద్యమంలో 369 మంది బలయ్యారు
జలియన్ వాలాబాగ్ పోరాటంలో 379 మంది చనిపోతే భగత్ సింగ్ ప్రతీకారం తీర్చుకున్నాడు..
369 మంది చనిపోయినా మేం హింసకు పాల్పడలేదు
యు.ఎన్. లో నిజాం కేసు పెండింగ్ లో ఉంది కాబట్టే ఆ రోజు ఇందిర తెలంగాణను ఇవ్వలేదు..
ఇందిర సమైక్య వాదానికి కట్టుబడి ఉన్నారనేది వాస్తవం కాదు
ఎన్టీఆర్ మానవతావాది.. తెలంగాణ వాది కాదు, సమైక్యవాదికాదు..
పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసింది ఎన్టీఆరే..
తెలంగాణ ఉద్యోగులకు న్యాయం చేయాలని 610 జీవో తెచ్చిందీ ఆయనే..
ఉద్యోగాల్లోనే కాదు.. పదవుల్లోనూ తెలంగాణకు అన్యాయం జరిగింది..
కేంద్రంలో 13 మంది సీమాంధ్ర మంత్రులుంటే.. ముగ్గురే తెలంగాణ వారున్నారు..
సీఎం, పీసీసీ చీఫ్, అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్ అన్ని పదవులు సీమాంధ్రులకే ఇచ్చారు..
రాష్ట్ర విభజనకు 371-D అడ్డు కానేకాదు.. సవరిస్తే చాలు
1999లో తెలంగాణ ఉద్యమాన్ని తెరపైకి తెచ్చింది వైఎస్సే..
2004లో యూపీఏ కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో తెలంగాణను చేర్చారు..
రాష్ట్రపతి ప్రసంగంలోనూ తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ చెప్పించింది..
ఆ తర్వాత ఏర్పాటైన ప్రణబ్ కమిటీకి టీడీపీ లేఖ ఇచ్చింది..
2008 వరకు టీడీపీ నినాదం సమైక్యాంధ్రే..
ఆ తర్వాతే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాం.
రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని కోరాం
తెలంగాణను కోరుకుంటూనే సీమాంధ్రకు న్యాయం చేయాలంటున్నాం..
కానీ కొంతమంది చంద్రబాబును, టీడీపీని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు..
డిసెంబర్ 9 రెండు ప్రాంతాలకు పవిత్రమైన రోజు..
మద్రాస్ నుంచి ఆంధ్రా విడిపోయింది కూడా డిసెంబర్ 9నే..
శ్రీకృష్ణ కమిటీ ప్రజాభిప్రాయ సేకరణకే ఏర్పాటైంది
కేంద్ర ప్రభుత్వం కోర్టుకు అదే విషయం చెప్పింది
సీడబ్ల్యుసీ నిర్ణయాన్ని పీసీసీ అధ్యక్షుడు వ్యతిరేకిస్తున్నారు
కేంద్రం నిర్ణయాన్ని సీఎం వ్యతిరేకిస్తున్నాడు.. ఇది రాజ్యాంగ విరుద్ధం
సీఎం తెలంగాణపై కుట్రలు చేస్తున్నా తెలంగాణ మంత్రులు రాజీనామా చేయలేదు..
మా మంచితనం, ఓర్పును అర్ధం చేసుకోవాలి.. న్యాయం కచ్చితంగా గెలుస్తుంది
పంపు సెట్లు తెలంగాణలో పెరిగి ఆంధ్రాలో తగ్గిన మాట  వాస్తవమే..
సాగునీటిలో అన్యాయం జరిగింది కాబట్టే తెలంగాణలో పంపు సెట్లు పెరిగాయి..
తెలంగాణలో పంపు సెట్లను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వలేదు..
ఉన్నదంతా అమ్ముకొని ఇక్కడి రైతులు పంపు సెట్లు పెట్టుకున్నారు..
చెరువులను విధ్వంసం చేసిన ఘనత కూడా సీమాంధ్ర పాలకులదే..
ఇంత అన్యాయం చేశాక మా కడుపు రగలదా..?
ఆంధ్రాకు బొగ్గు వెళ్లడం లేదని సీఎం అంటున్నారు.. అది తప్పు
వీటీపీఎస్ కు ఏటా 30 లక్షల టన్నుల బొగ్గు సింగరేణి నుంచి వెళ్తుంది
సమైక్య రాష్ట్రంలో నల్గొండకు ఫ్లోరైడే మిగిలింది..

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy