RTA ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు: షోరూంలోనే రిజిస్ట్రేషన్లు

కొత్తగా వెహికిల్ కొన్న వారికి రిజిస్ట్రేషన్ కోసం ఇకపై ఆర్టీఏ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇక నుంచి వాహనం కొనుగోలు చేసిన షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చు.దీనికి సంబంధించి వాహనదారులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం ఓ కొత్త జీవోను విడుదల చేసింది. పర్మనెంట్‌ రిజిస్ట్రేషన్‌(PR), హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ షో రూం లోనే తీసుకోవచ్చు. అంతేకాదు ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ (TR) స్థానంలో ఏకంగా ఒకేసారి శాశ్వత రిజిస్ట్రేషన్‌ చేసేస్తారు. పర్మనెంట్‌ రిజిస్ట్రేషన్, హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌తో కొత్త వాహనం రోడ్డెక్కేయొచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఈ విధానం విజయవంతంగా అమలు జరుగుతున్న క్రమంలో తెలంగాణలోనూ అమల్లోకి తెచ్చేందుకు రవాణాశాఖ కసరత్తులు చేస్తోంది.

మొదట హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు సంయుక్త రవాణా కమిషనర్‌ రమేశ్‌ తెలిపారు. దీనికోసం ఆంధ్రప్రదేశ్‌ అనుభవాలను లెక్కలోకి తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి విధి విధానాలను రూపొందించనున్నారు. ప్రస్తుతం ఉన్న పద్ధతుల్లో మార్పులు, జీవితకాల పన్ను చెల్లింపుల్లోనూ, ఎక్స్‌షోరూమ్‌ ప్రైస్‌ తెలపకపోవడం లాంటి అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది. అలాగే ప్రస్తుతం ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ వాహనాలను కలిగి ఉంటే అదనంగా 2 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. ఇలాంటి అదనపు వసూళ్లకు ఎలాంటి పద్ధతులను అనుసరించాలనేది అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు. అన్ని కోణాల్లోనూ సమగ్రంగా పరిశీలించిన తర్వాత జీవో అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే ఈ విధానంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉంటుందని కొందరు అధికారులు అభిప్రాయ పడుతున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy