RTC ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు: మహేందర్ రెడ్డి

mahendarఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు మంత్రి మహేందర్‌రెడ్డి. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. TSRTCకి 1,474 ఎకరాల భూమి ఉందని తెలిపారు. RTC స్థలాల్లో పెట్రోల్ బంక్‌లను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఖమ్మం, కరీంనగర్ బస్టాండ్లలో మినీ థియేటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 1,100 కొత్త బస్సులు తీసుకున్నట్లు తెలిపారు. ఏపీకి ప్రస్తుతం 180 బస్సులు నడుపుతున్నట్లు త్వరలో మరో 150 బస్సులు నడుపనున్నట్లు తెలిపారు మంత్రి మహేందర్ రెడ్డి.

 

 

 

 

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy