RTC కార్మికుల డిమాండ్లపై సర్కార్ సానూకూలం : ఈటల

etela rtcఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి ఈటల రాజేందర్. కార్మికుల సమస్యలపై సానుకూలంగా ఉన్నామన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో.. ఆదివారం (మే-13) మంత్రుల కమిటీ సమావేశమైంది. కార్మికుల సమస్యలపై చర్చించారు నేతలు. మే 15న సీఎంకు నివేదిక ఇస్తామన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల విషయంలో సానుకూల వైఖరితో ఉందన్నారు టీఎంయూ నేత అశ్వథ్థామరెడ్డి. కార్మికులు ఆందోళన పడొద్దని మంత్రులు సూచించారన్నారు.

ఉద్యోగుల సమస్యలపై తాను, సహచర మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి ఇప్పటికే సమావేశం నిర్వహించి.. వారి సమస్యలపై కూలంకషంగా చర్చించి నివేదికను సమర్పించామని గుర్తుచేశారు. అదే విధంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కూడా నివేదిక అందజేస్తామన్నారు. 16వ తేదీన సీఎం సమక్షంలో జరిగే సమావేశంలో ఒక నిర్ణయం వచ్చే ఆస్కారం ఉన్నందున.. ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఒకరోజు ముందుగా ఆయనకు నివేదిక సమర్పిస్తామని తెలిపారు. 52 వేల మంది కార్మికులతో నిత్యం లక్షల మందికి సేవలు అందిస్తున్న ఆర్టీసీ విషయంలో కూడా ఆ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డిని కలుపుకొని ఆ సంస్థతో, ఆ సంఘం నాయకులతో చర్చించి నివేదిక ఇవ్వాలని సీఎం చెప్పడంతో ఆదివారం (మే13) సమావేశమైనట్లు చెప్పారు ఈటల.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy