SBI సర్వీస్ ఛార్జీల మోత ఇప్పుడే కాదు

sbiస్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఖతాదారులకు కొంత ఊరటనిచ్చింది. నిబంధనల ప్రకారం అకౌంట్ లో కనీస బ్యాలెన్స్ లేకుంటే సర్వీస్ ఛార్జీలు విధించనున్నట్లు ప్రకటించిన SBI.. ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. కనీస ఖాతా నిల్వ నిబంధన ఏప్రిల్ 24 తర్వాత అమల్లోకి రానుందట. దేశ వ్యాప్తంగా SBI లో బ్యాంకుల విలీనం అమల్లోకి వచ్చినా..కొంత అంతర్గత ప్రక్రియ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకుకు చెందిన ఓఅధికారి తెలిపారు.

మెట్రో నగరాల్లో రూ.5వేలు, నగరాల్లో రూ.3వేలు, పట్టణాల్లో రూ.2000, గ్రామాల్లో రూ.1000 మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే సర్వీస్ ఛార్జీ విధిస్తామని కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభ సందర్భంగా ప్రకటించింది ఎస్బీఐ.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy